తీహార్ జైల్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. జైల్లో ఎలాంటి వ‌స‌తులు క‌ల్పించారంటే!

కేజ్రీవాల్ ఇప్పటికే రెండుసార్లు తీహార్ జైలుకు వెళ్లాడు. 2012 అక్టోబర్ లో అన్నాహజారే చేపట్టిన ఉద్యమ సమయంలో మొదటిసారి అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్లారు. 2014లో బీజేపీ నేత..

తీహార్ జైల్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. జైల్లో ఎలాంటి వ‌స‌తులు క‌ల్పించారంటే!

Arvind Kejriwal Tihar Jail : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేసి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హారుపర్చారు. దీంతో కోర్టు రెండు దఫాలుగా ఈడీ కస్టడీకి అప్పగించింది. సోమవారం ఈడీ కస్టడీ గడువు ముగియడంతో మరోసారి అధికారులు కే్జ్రీవాల్ ను కోర్టులో హాజరుపర్చారు. ఈడీ వాదనలువిన్న తరువాత కోర్టు కేజ్రీవాల్ కు ఈనెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం తీహార్ జైలు నంబర్ 1లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఉన్నారు. జైల్లోని నంబర్ 7లో మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, జైల్లోని నంబర్ 5లో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నారు.

Also Read : Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్‌.. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ..

ఇదిలాఉంటే.. కేజ్రీవాల్ ఇప్పటికే రెండుసార్లు తీహార్ జైలుకు వెళ్లాడు. 2012 అక్టోబర్ లో అన్నాహజారే చేపట్టిన ఉద్యమ సమయంలో మొదటిసారి అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్లారు. 2014లో బీజేపీ నేత నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం కేసులో రూ. 10,000 బెయిల్ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించడంతో రెండు రోజులపాటు కేజ్రీవాల్ తీహార్ జైల్లో గడిపారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లారు.

తీహార్ జైలులో కేజ్రీవాల్ కు అండర్ ట్రయల్ ఖైదీ (యూటీ) 670వ నెంబర్ కేటాయించారు. జైలులో నెంబర్2లోని వార్డ్ నెంబర్ 3లో కేజ్రీవాల్ ను ఉంచారు. జైలు గదిబయట 24 గంటలపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. తీహార్ లో కేజ్రీవాల్ ను కలిసేందుకు ఐదుగురు సందర్శకులకు అనుమతి కల్పించనున్నారు. వారానికి రెండు సార్లు కేజ్రీవాల్ భార్య, కుమార్తె, కుమారుడు, ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్, రాజ్యసభ ఎంపీ, ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థ) సందీప్ పాఠక్ కు ములాఖత్ లో కలిసేందుకు అనుమతి కల్పించారు. ప్రతీరోజూ ఒక ఫోన్ కాల్ ఐదు నిమిషాలు మాట్లాడేందుకు అనుమతిచ్చారు.

Also Read : Arvind Kejriwal : జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేం.. స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

కేజ్రీవాల్ జైలులో 24గంటలపాటు సీసీ టీవీ పర్యవేక్షణలో ఉండనున్నారు. కేజ్రీవాల్ కు జైలులో స్పెషల్ డైట్, ఇంటి భోజనం, వైద్యులు సూచించిన మందులు, షుగర్ కిట్, బెడ్, మాట్రిస్, రెండు దిండ్లు, దుప్పట్లు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ షుగర్ లెవల్స్ సడన్ గా పడిపోతే అందుకోసం గ్లూకోస్, చాకెట్లకు ఇచ్చేందుకు అనుమతి ఉంది. జపమాల, రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలకు కేజ్రీవాల్ కు అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు తీహార్ జైలులోనే కే్జ్రీవాల్ ఉండనున్నారు.