ఎగ్జిట్ పోల్స్ ఓకే…EVMల సెక్యూరిటీ? : పీకేని కలిసిన కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : February 8, 2020 / 05:15 PM IST
ఎగ్జిట్ పోల్స్ ఓకే…EVMల సెక్యూరిటీ? : పీకేని కలిసిన కేజ్రీవాల్

Updated On : February 8, 2020 / 5:15 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుందని ఇవాళ(ఫిబ్రవరి-8,2020)పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ కే పట్టం కట్టారని సర్వేలన్నీ చెబుతున్న సమయంలో ఢిల్లీ సీఎం మరింత అలర్ట్ అయ్యారు. ఈవీఎం మెషిన్ల సెక్యూరిటీ గురించి చర్చించేందుకు పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్,ఆప్ ముఖ్యనాయకులతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా,సంజయ్ సింగ్,రాఘవ్ చద్దా,గోపాల్ రాయ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు అన్ని ఎగ్జిపోల్స్ కేజ్రీవాల్ దే అధికారం అని తేల్చేశాయి. ఆప్ కు మొత్తం 70స్థానాల్లో 56స్థానాలు వచ్చే అవకాశమున్నట్లు తేల్చాయి. ఇక బీజేపీకి 15సీట్లకు మించి రావని చెప్పాయి. అయితే ఇక్కడ దశాబ్దాల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కు వస్తే ఒక్క సీటు రావచ్చు లేకుంటే అది కూడా లేదని అంచనా వేశాయి.

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 36మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే బీజేపీ ఎగ్జిట్స్ పోల్స్ అవాస్తవమని చెబుతోంది. ఢిల్లీ ఓటర్లకు బీజేపీకే పట్టం కట్టారని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు. ఫిబ్రవరి-11న ఢిల్లీ పలితాలు వెలువడనున్నాయి.