Delhi liquor scam: కేజ్రీవాల్‌కు నోటీసులు అందడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Delhi liquor scam: కేజ్రీవాల్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

Delhi liquor scam: కేజ్రీవాల్‌కు నోటీసులు అందడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Delhi liquor scam

Updated On : April 15, 2023 / 5:39 PM IST

Delhi liquor scam: ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party-AAP)) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు లిక్కర్ స్కాంలో సీబీఐ (Central Bureau of Investigation-CBI) నోటీసులు జారీ చేసిన వేళ ఆయన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం.

ఆదివారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాతి రోజే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి, కేజ్రీవాల్‌కు లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయంపై చర్చిస్తారు. ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైలులో ఉన్నారు. కేజ్రీవాల్ ను విచారించి, అరెస్టు చేస్తారని ఇప్పటికే ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి, జైలుకు పంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

ఇవాళ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ… “పరిస్థితులు బాగోలేదు. దీనిపై అసెంబ్లీలో చర్చించాల్సి ఉంది. ప్రస్తుతం ఏం జరుగుతోందన్న విషయంపై ఢిల్లీ ప్రభుత్వ నేతలు మాట్లాడతారు” అని చెప్పారు. కాగా, అసలు ఢిల్లీలో లిక్కర్ స్కాం అన్నదే జరగలేదని కేజ్రీవాల్ అంటున్నారు. దర్యాప్తు సంస్థలు కోర్టుల్లో అసత్యాలు చెబుతున్నాయని చెప్పారు. దీంతో సీబీఐ, ఈడీపై తాము కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Delhi liquor scam: సీబీఐ ఎదుట కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారు: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటన