Asaduddin Owaisi challenge : రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ బిగ్ ఛాలెంజ్

హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు,ఆల్‌ ఇండియా మజిలీస్‌-ఏ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్‌లో కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని రాహుల్‌ గాంధీకి ఒవైసీ ఆదివారం సవాల్‌ విసిరారు.....

Asaduddin Owaisi challenge :  రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ బిగ్ ఛాలెంజ్

Asaduddin challenges Rahul

Asaduddin Owaisi challenge : హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు,ఆల్‌ ఇండియా మజిలీస్‌-ఏ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్‌లో కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని రాహుల్‌ గాంధీకి ఒవైసీ ఆదివారం సవాల్‌ విసిరారు. (Asaduddin Owaisi challenges Rahul Gandhi) హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. (contest elections from Hyderabad)

Gujarat : గుజరాత్‌లో కూలిన వంతెన…నదిలో పడిన 10 మందిని రక్షించారు

1992వ సంవత్సరంలో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ‘‘నేను రాహుల్ గాంధీని వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయమని సవాలు చేస్తున్నాను, మీరు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఉంటారు, మైదానంలోకి వచ్చి నాపై వ్యతిరేకంగా పోటీ చేయండి’’ అని అసద్ ప్రజల హర్షధ్వానాల మధ్య అన్నారు.

First Wedding Photo : భార్యాభర్తలుగా ఎంపీ రాఘవ్ చద్దా, పరిణితీ చోప్రాల ఫస్ట్ ఫొటో

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదును కూల్చివేశారని అసదుద్దీన్ పునరుద్ఘాటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల తర్వాత ఒవైసీ ఈ సవాలు విసిరారు. ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి మతపరంగా దూషించిన ఘటనపై అసద్ మాట్లాడుతూ పార్లమెంటులో ముస్లింపై మూక హత్యలు జరిగే రోజు ఎంతో దూరం లేదన్నారు.

Nigeria : నైజీరియాలో గన్‌మెన్ కాల్పుల్లో 14 మంది మృతి

‘‘మీ సబ్కా సాత్, సబ్కా వికాస్ ఎక్కడ ఉందని, దీనిపై దేశ ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో ముస్లిం ఎంపీ గురించి మాట్లాడిన బీజేపీ ఎంపీని నాతో వాదించలేరని, కూర్చోమని చెప్పాను’’ అని ఒవైసీ పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ సభ్యుడు అలీని ఉద్ధేశించి బిధూరి చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రతిపక్ష నాయకులు బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.