బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు జరిగాయి: కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి
ఏపీకి కేటాయింపులపై కూడా అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు చెప్పారు.

Ashwini Vaishnaw
తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో.. రైల్వేకు రూ.5,337 కేటాయింపులు జరిగాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యూపీఏ హయాంలో రూ.886 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు.
ఇవాళ ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో రూ.41,667 కోట్ల పెట్టుబడి పెట్టామమని చెప్పారు. తెలంగాణలో 1,322 కిలో మీటర్లు కవచ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త వందే భారత్ రైళ్లను తెలంగాణకు కేటాయిస్తామని అన్నారు. నవభారత్ రైళ్లు కూడా ఇస్తున్నామని తెలిపారు.
అమృత్ భారత్ రైళ్లను వెయ్యి కిలోమీటర్లకు రూ.450తో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామన్నారు. 100 అమృత్ భారత్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
అలాగే, కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పలు పనులకు అనుమతులు కావాలని చెప్పారు. ప్రధాన రైల్వే స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ “కవచ్”ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 1,026 కిలో మీటర్ల మేరకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండేళ్లలో దేశమంతా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
Also Read: తండ్రి మృతదేహాన్ని రెండు భాగాలుగా చేసి తనకు ఓ భాగం ఇవ్వాలని అంత్యక్రియలకు అడ్డుపడ్డ వ్యక్తి
ఏపీకి కేటాయింపులపై..
ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9.417 కోట్లు కేటాయించాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. యూపీఏ హయాంలో కంటే 11 రేట్లు అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. ఏపీలో 84,559 కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతున్నాయని చెప్పారు. 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశామని తెలిపారు. 100 శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ పూర్తయిందని, 1,560 కి.మీ. రైల్వే ట్రాక్ నిర్మించామని చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి సహకారానికి ధన్యవాదాలని అన్నారు. 8 వందే భారత్ రైళ్లు 16 జిల్లాలను కలుపుతూ ఏపీలో సేవాలందిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఏపీకి మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 110 కి.మీ. వేగం తో వెళ్లేందుకు ట్రాక్స్ ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కొన్ని రూట్లలో 130 కి.మీ. వేగం, కొన్ని రూట్లలో 160 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయనించేలా ట్రాక్స్ సిద్ధం చేస్తున్నామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.