Odisha Minister Naba Das: పట్నాయక్ కేబినెట్‌లో అత్యంత ధనిక మంత్రి నబకిశోర్ దాస్ .. ఆయనపై కాల్పులు జరిపింది ఏఎస్ఐ ..
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వంలో నబకిశోర్ దాస్ అత్యంత ధనవంతులైన మంత్రుల్లో ఒకరు. ఆయనకు లగ్జరీ వాహనాలంటే ఎంతో ఇష్టం. దాదాపు రూ.16కోట్ల విలువైన 80 వాహనాలు నబకిశోర్ దాస్ వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. నబా దాస్‌తో కూడిన 80 వాహనాల్లో రూ.1.40 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారుకూడా ఉంది.

Odisha Minister Naba Das
Odisha Minister Naba Das: ఒడిశా ఆరోగ్య మంత్రి నబకిశోర్ దాస్‌పై ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఝార్సుగూడ బ్రిజరాజ్ నగర్‌లోని గాంధీచౌక్ వద్ద ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన నబకిశోర్ దాస్ తన కాన్వాయ్ దిగేక్రమంలో కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అత్యంత దగ్గరగా ఐదు రౌండ్లు జరిపిన కాల్పుల్లో మంత్రి కిందపడిపోయాడు. వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంత్రిపై కాల్పులు జరిపింది ఎవరనే విషయంపై పోలీసులు ఆరాతీయగా.. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఏఎస్ఐ గోపాల్ దాస్ గా గుర్తించారు.
గాంధీచౌక్ పోలీస్ పోస్ట్‌లో గోపాల్‌దాస్‌ను నియమించారు. గోపాల్ దాస్ తన రివాల్వర్‌తో మంత్రి నాబాదాస్‌పై కాల్పులు జరిపాడు. మంత్రి కాన్వాయ్ దిగే క్రమంలో అతిదగ్గరగా వెళ్లి ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఏఎస్ఐ పారిపోతుండగా స్థానిక ప్రజలు గమనించారు. నబకిశోర్ దాస్ ఒడిశా కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ)లో చేరాడు. నబా దాస్ బీజేడీలో చేరిన కొద్దిరోజులకే సీఎం నవీన్ పట్నాయక్ అతన్ని కేబినెట్ లోకి తీసుకున్నాడు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. నవీన్ పట్నాయక్ కేబినెట్ లో బలమైన వ్యక్తుల్లో నబకిశోర్ దాస్ ఒకరు.
నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వంలో నబకిశోర్ దాస్ అత్యంత ధనవంతులైన మంత్రుల్లో ఒకరు. ఆయనకు లగ్జరీ వాహనాలంటే ఎంతో ఇష్టం. దాదాపు రూ.16కోట్ల విలువైన 80 వాహనాలు నబా దాస్ వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. నబా దాస్‌తో కూడిన 80 వాహనాల్లో రూ.1.40 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారుకూడా ఉంది. నబకిశోర్ దాస్ భార్యకు కూడా కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి.