Toll Fee: టోల్ ఫీజు అడిగితే చేతిలో కొడవలి పెట్టాడు.
చిక్కజాల స్టేషన్ పోలీసులు టోల్ గేట్ వద్దకు వచ్చిన సదరు వ్యక్తిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించాడు. అతడు స్థానిక రైతులు అని తేలడంతో వదిలివేశారు.

Toll Fee
Toll Fee: టోల్ ఫీజు అడిగితే ఓ రైతు టోల్ సిబ్బంది చేతిలో కొడవలి పెట్టాడు. దీంతో వారు హడలిపోయారు. ఈ ఘటన బెంగళూర్ సమీపంలో చోటుచేసుకుంది. బెంగళూరు – హైదరాబాద్ మార్గంలోని కెంపేగౌడ ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న టోల్ గేట్ వద్దకు గురువారం ఆదాయంలో కారులో వచ్చాడు ఓ వ్యక్తి. టోల్ గేట్ నుంచి వెళ్తుండగా సిబ్బంది కారును అడ్డుకొని టోల్ చెల్లించాలని కోరారు.
తాను స్థానికుడినని, రైతునని పొలానికి వెళ్లివస్తున్నానని తెలిపాడు. అయితే ఓ ఖరీదైన కారులో పొలానికి వెళ్లి వస్తున్నాడు అంటే వారికి నమ్మకం కలగలేదు. దీంతో రైతు తన పక్కసీట్లో వున్న కొడవలి తీసి టోల్ సిబ్బంది చేతిలో పెట్టారు. దీంతో హడలిపోయిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చిక్కజాల స్టేషన్ పోలీసులు టోల్ గేట్ వద్దకు వచ్చిన సదరు వ్యక్తిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించాడు. అతడు స్థానిక రైతులు అని తేలడంతో వదిలివేశారు.