తిన్నదానికి బిల్లు కట్టమన్నారని.. ధాబా ఓనర్ సహా 10మందిని ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
తిన్నదానికి బిల్లు కట్టమని అడిగిన పాపానికి ఓ ధాబా ఓనర్ కుటుంబం మీద డ్రగ్స్, మద్యం అక్రమ రవాణ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో ఈ దారుణం జరిగింది. అంతేకాకుండా ధాభా ఓనర్ కి మద్దతుగా నిలిచిన 9మంది కస్టమర్లని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపారు.

Up Cops1
UP Cops తిన్నదానికి బిల్లు కట్టమని అడిగిన పాపానికి ఓ ధాబా ఓనర్ కుటుంబం మీద డ్రగ్స్, మద్యం అక్రమ రవాణ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో ఈ దారుణం జరిగింది. అంతేకాకుండా ధాభా ఓనర్ కి మద్దతుగా నిలిచిన 9మంది కస్టమర్లని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపారు. విషయం కాస్త పెద్దది కావడంతో ఘటన జరిగిన 40 రోజుల తర్వాత రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్,ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఓ ధాబా నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రవీణ్ కుమార్ ధాబాకు వచ్చి భోజనం చేశారు. 400 రూపాయల బిల్లు అయితే వారు కేవలం 80 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం..కనీసం రూ.200అయినా చెల్లించాలని ప్రవీణ్ కుమార్..పోలీసులని కోరాడు. అయితే,అప్పటికే పీకలదాకా మద్యం సేవించి ఉన్న పోలీసులు..మమ్మల్నే బిల్లు కట్టమంటా అంటూ ప్రవీణ్ పై దాడికి దిగారు. అయితే,ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ధాభాలోని 9మంది కస్టమర్లను కూడా మీ అంతు చూస్తాం అని పోలీసులు బెదిరించారు. కొద్ది సేపు ధాబాలో వాగ్వాదం తర్వాత పోలీసులు బిల్లు కట్టకుండానే వెళ్లిపోయారు.
అయితే, ఆ పోలీసులు ధాబా వదిలి వెళ్లిన కొద్దినిమిషాల్లోనే 15మంది పోలీసులు ధాబాకి చేరుకొని ప్రవీణ కుమార్ దివ్యాంగుడనే కారణంతో అతడిని వదిలేసి అతడి తమ్ముడు,మరియు ధాబా ఓనర్ కి మద్దుతుగా నిలిచిన 9మంది కస్టమర్లను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
కొత్వాలి దేహాట్ పోలీస్ స్టేషన్ లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో…ధాబాలో 10 మంది ముఠా దోపిడీకి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. అంతేకాకుండా,వారు తమపై కాల్పులకు పాల్పడ్డారని కూడా పోలీసులు ఆరోపించారు. వారి వద్ద నుంచి ఆరు దేశీ తుపాకులను, 2 కిలోల నిషేధిత డ్రగ్స్ మరియు 80 లీటర్ల అక్రమ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులురికార్డుల్లో చూపించారు. ఈ ఘటన జరిగిన 40 రోజుల తర్వాత వివాదం కాస్త ముదరడంతో జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.