Assam Elections Results 2026 Live : అసోంలో బీజేపీ ప్రభంజనం.. కాంగ్రెస్ డీలా
Assam Elections Results 2026 Live : దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా అస్సాం ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది.
Assam Assembly Elections Results 2026 Live
Assam Elections Results 2026 Live : ఎర్లీ ట్రెండ్స్ లో సీఎం హిమంత బిశ్వ శర్మ ముందంజలో ఉన్నారు. ఆయన జల్ కుబ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 
అసోంలో వెలువడుతున్న తొలిదశ ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో దూసుకుపోతోంది. కాంగ్రెస్, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు డీలా పడ్డాయి.
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా అస్సాం ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. అస్సాంలో హ్యాట్రిక్ సాధించగలమని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ధీమాతో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా.. 85.96శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నిలక బరిలో ఉన్న ప్రముఖులలో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఉన్నారు.
