Bharat Jodo Yatra : రాహుల్ చేయాల్సింది భారత్ జోడో యాత్ర కాదు .. ‘అఖండ భారత్’ కోసం యాత్ర చేయాలి’ : అసోం సీఎం

రాహుల్ గాంధీ చేయాల్సింది ‘భారత్ జోడో’ యాత్ర కాదు ‘అఖండ భారత్’ కోసం పాదయాత్ర చేయాలి అంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో అసోం సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Bharat Jodo Yatra : రాహుల్ చేయాల్సింది భారత్ జోడో యాత్ర కాదు .. ‘అఖండ భారత్’ కోసం యాత్ర చేయాలి’ : అసోం సీఎం

Bharat Jodo Yatra..Assam CM Himanta Sarma

Updated On : September 8, 2022 / 9:55 AM IST

Bharat Jodo Yatra..Assam CM Himanta Sarma : రాహుల్ గాంధీ చేయాల్సింది ‘భారత్ జోడో’ యాత్ర కాదు ‘అఖండ భారత్’ కోసం పాదయాత్ర చేయాలి అంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఏకం చేయాలని తిరిగి అఖండ భారతం నెలకొనాలని దాని కోసం రాహుల్ గాంధీ ‘అఖండ భారత్’ భారత్ కోసం కృషి చేయాలంటూ రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో అసోం సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ రకంగా చెప్పాలంటే వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ‘సెప్టెబంబ 7,2022) తమిళనాడులోని కన్యాకుమారిలో ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభించారు. రాహుల్ పై విమర్శలు చేసే క్రమంలో అసోం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్రపై మీ స్పందన ఏంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకు హిమంత ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

Also read : Bharat Jodo Yatra : క‌న్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు .. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ప్రారంభం

కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన సీఎం హిమంత కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ ఇప్పుడు ఐక్యంగానే ఉందని ..సిల్చార్ నుంచి సౌరాష్ట్ర వరకు మనమంతా ఒకటేనని..మనమంతా భారీతీయులం అని అన్నారు. భారత్‌ను కాంగ్రెస్సే విడగొట్టి భారత్, పాకిస్థాన్‌గా విడదీసింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడితో భారత్ ముక్కలు కావటం ఆగలేదు..ఆ తర్వాత బంగ్లాదేశ్ ఓ దేశంగా ఏర్పడింది అని అన్నారు. రాహుల్ గాంధీ కనుక తన కుటుంబం (కాంగ్రెస్ పార్టీ)చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడితే ఆయన భారత్ జోడో యాత్ర కాకుండా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను కలిపే అఖండ భారత్ కోసం కృషి చేయాలని అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. భారత భూభాగంలో మాత్రమే ‘భారత్ జోడో’ చేయటం వల్ల ప్రయోజనం లేదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఏకం చేసి, అఖండ భారత్‌ను రూపొందించేందుకు కృషి చేయండి అంటూ రాహుల్ పై విమర్శలు సంధించారు అసోం సీఎం.

Also read : Ashok Gehlot warns bjp: ఇలాగైతే భారత్‌లో అంతర్యుద్ధం వస్తుంది: సీఎం అశోక్ గహ్లోత్ వార్నింగ్

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని హసీనా.. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పలు అంసాలపై చర్చించారు. కాగా రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జూడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది..ఈ యాత్ర జమ్మూకశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా యాత్ర జరగనుంది. సుమారు 3,570 కి.మీ. మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.