Bharat Jodo Yatra : క‌న్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు .. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ప్రారంభం

రాహుల్ గాంధీ త‌ల‌పెట్టిన‌ భార‌త్ జోడో యాత్ర బుధ‌వారం (సెప్టెంబర్ 7,2022) సాయ‌త్రం ప్రారంభం అయ్యింది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో సాయంత్రం 5 గంట‌ల‌కు రాహుల్ త‌న యాత్ర‌ను ప్రారంభించారు. త‌న ముందు పార్టీ సేవా ద‌ళ్‌ శ్రేణులు క‌దం తొక్కుతూ సాగ‌గా... రాహుల్ గాంధీ త‌న సుదీర్ఘ యాత్ర‌ను ప్రారంభించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ చేతికి త్రివర్ణ పతాకాన్ని అందించారు. రాహుల్ వెంట 59 ట్రక్కులంతో పాటు 118మంది కాంగ్రెస్ నేతలు కూడా పయనమయ్యారు.

Bharat Jodo Yatra : క‌న్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు .. రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర ప్రారంభం

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ త‌ల‌పెట్టిన‌ భార‌త్ జోడో యాత్ర బుధ‌వారం (సెప్టెంబర్ 7,2022) సాయ‌త్రం ప్రారంభం అయ్యింది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారిలో సాయంత్రం 5 గంట‌ల‌కు రాహుల్ త‌న యాత్ర‌ను ప్రారంభించారు. త‌న ముందు పార్టీ సేవా ద‌ళ్‌ శ్రేణులు క‌దం తొక్కుతూ సాగ‌గా… రాహుల్ గాంధీ త‌న సుదీర్ఘ యాత్ర‌ను ప్రారంభించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ చేతికి త్రివర్ణ పతాకాన్ని అందించారు. రాహుల్ వెంట 59 ట్రక్కులంతో పాటు 118మంది కాంగ్రెస్ నేతలు కూడా పయనమయ్యారు.

12 రాష్ట్రాల మీదుగా..150 రోజుల పాటు సాగ‌నున్న ఈ యాత్ర‌ 3,570 కిలోమీట‌ర్ల మేర కొన‌సాగ‌నుంది. క‌న్యాకుమారిలో మొద‌లైన ఈ యాత్ర క‌శ్మీర్‌లో ముగియ‌నుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగేలా కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ యాత్ర చేప‌ట్టడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోడో యాత్ర జోష్ వ్య‌క్త‌మ‌వుతోంది. కాగా..2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌మే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు.

Also read : Bharat Jodo Yatra : కాసేపట్లో భారత్ జోడో యాత్ర ప్రారంభం .. రాహుల్ గాంధీకి త్రివర్ణ పతాకాన్ని అందించనున్న సీఎం స్టాలిన్

భారత్ జోడో యాత్ర ప్రారంభం సందర్భంగా కన్యాకుమారిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ… దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ జోడో నినాదం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ద్వేషం, ఆందోళన, హింస దేశంలో చోటుచేసుకుంటోందని గహ్లోత్ చెప్పారు. దీనిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందని అన్నారు. ప్రేమ, సోదరభావం, సామరస్యంతో మెలగాలని, హింస ఉండకూడదని ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందేశం ఇవ్వాలని అశోక్ గహ్లోత్ చెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటివరకు ఈ పని చేయలేదని ఆయన అన్నారు. దేశంలో కులం, మతం పేరిట ద్వేషాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. దీన్ని నియంత్రించకపోతే అంతర్యుద్ధం దిశగా వెళ్తామని అన్నారు. దేశాన్ని ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర ఇస్తున్న సందేశాన్ని తెలుసుకుని, దాని ప్రకారం మెలగాలని ప్రధాని మోదీ, అమిత్ షాకు ఆయన సూచించారు. లేదంటే ప్రస్తుత తరం వారిని క్షమించబోదని చెప్పుకొచ్చారు.