Bharat Jodo Yatra : కాసేపట్లో భారత్ జోడో యాత్ర ప్రారంభం .. రాహుల్ గాంధీకి త్రివర్ణ పతాకాన్ని అందించనున్న సీఎం స్టాలిన్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. యాత్ర ప్రారంభించనున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ త్రివర్ణ పతాకాన్ని అందించనున్నారు.

Bharat Jodo Yatra : కాసేపట్లో భారత్ జోడో యాత్ర ప్రారంభం .. రాహుల్ గాంధీకి త్రివర్ణ పతాకాన్ని అందించనున్న సీఎం స్టాలిన్

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు (సెప్టెంబర్ 7,2022)సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. యాత్ర ప్రారంభించనున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇప్పటికే కన్యాకుమారి చేరుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ త్రివర్ణ పతాకాన్ని అందించనున్నారు. ఈ యాత్రలో రాహుల్ వెంట 118మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. భారత్ జూడో యాత్రలో భాగంగా రాహుల్ రోజుకు 23 కిలోమీటర్లు నడవనున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమై జమ్మూకశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా యాత్ర జరగనుంది.

ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సుమారు 3,570 కి.మీ. మేర పాదయాత్ర చేయనున్నారు. దీనికోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దేశంలో మతోన్మాదం, విభజన రాజకీయాలు, ద్రోవ్యోల్పణ, నిరుద్యోగ సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలన్న లక్ష్యంతోనే భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాను రాహుల్ గాంధీ ఎండగడతారని తెలిపింది. ఒక అడుగు నీది.. ఒక అడుగు నాది.. యాత్రలో చేరి మనందరం భారత్‌ను ఏకం చేద్దాం నినాదంతో.. ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదని.. కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే ఎక్కడా కాంగ్రెస్ గుర్తును పెట్టలేని వెల్లడించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానున్న సందర్భంగా రాహుల్ గాంధీ బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్‌లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. రాహుల్ రాజకీయ ప్రవేశం చేసిన తరువాత ఈ స్మారకం సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉదయం 7గంటల సమయంలో తండ్రి రాజీవ్ గాంధీ స్మారకం ను సందర్శించి రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకుముందు ఈ స్మారకం ప్రాంగణంలో రాహుల్ మొక్కను నాటారు.

రాజీవ్ గాంధీ స్మారకం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా రాహుల్ పలు కీలక వ్యాఖలు చేశారు. విద్వేష, విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదంటూ రాహుల్ తన ట్విటర్ లో పేర్కొన్నారు.