యూపీ అసెంబ్లీ వాయిదా: సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల నిరసన

  • Published By: sreehari ,Published On : December 18, 2019 / 07:16 AM IST
యూపీ అసెంబ్లీ వాయిదా: సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల నిరసన

Updated On : December 18, 2019 / 7:16 AM IST

యూపీ అసెంబ్లీలో అరుదైన సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలంత సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తారు. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా గళమెత్తిన బీజేపీ నేతలను మాట్లాడేందుకు సభలో స్పీకర్ అనుమతించకపోవడంపై మండిపడ్డారు.

ఘజియాబాద్ లోని లోనికి చెందిన ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుజ్జర్ తనను ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారంటూ ఆరోపించారు. ఆయా ఆధికారులకు వెంటనే సమన్లు జారీ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కిషోర్ కు విపక్షాలు సైతం మద్దతుగా నిలిచాయి.

అదే సమయంలో.. మరో మంత్రి మంత్రి సురేశ్ ఖన్నా, స్పీకర్ హ్రీదే నారాయణ్ దీక్షిత్.. ఈ అంశంపై తరువాత చర్చిద్దామని బీజేపీ ఎమ్మెల్యేలను ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు సామాజ్ వాదీపార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికారు. ఎస్పీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ వెల్ లోకి ప్రవేశించి కిషోర్ కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో సభలో స్పీకర్ సభ్యులను వారించేందుకు పలుమార్లు వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం కూడా నిరసన కొనసాగింది. కిషోర్ అంశంపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేయక తప్పలేదు.