Maharashtra: అక్కడ లీటరు పెట్రోల్ రూ.54కే.. క్యూకట్టిన వాహనదారులు

పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ. 100కు చేరింది. దీంతో వాహనదారులు సొంత వాహనాలపై బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అయితే మంగళవారం ఒక్కరోజు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్ లో లీటరు పెట్రోల్ రూ. 54కే విక్రయించారు.

Maharashtra: అక్కడ లీటరు పెట్రోల్ రూ.54కే.. క్యూకట్టిన వాహనదారులు

Maharastra (1)

Maharashtra: పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ. 100కు చేరింది. దీంతో వాహనదారులు సొంత వాహనాలపై బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అయితే మంగళవారం ఒక్కరోజు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్ లో లీటరు పెట్రోల్ రూ. 54కే విక్రయించారు. దీంతో వాహనదారులు ఆ పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులతో రద్దీ నెలకొంది.

Maharastra (2)

రూ.54కే లీటరు పెట్రోల్ అందించడానికి అసలు కారణం.. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పుట్టిన రోజు కావటమే. అయితే రాజ్‌ఠాక్రే పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. కరోనా డెడ్‌సెల్స్‌కు సంబంధించి శస్త్రచికిత్స జరగబోతుండటంతో బర్త్ డే వేడుకల్లో పాల్గోనని సోమవారం ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. దీంతో అధినేత పుట్టిన రోజున ఏదైనా మంచిపని చేయాలని భావించిన ఆ పార్టీ ఉపాధ్యక్షులు మౌళి థోర్వే, సవితా థోర్వేలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లీటర్ పెట్రోల్ రూ.54కే పోసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వాహనదారులు పెట్రోల్ కోసం బారులు తీరారు.