ATM నుంచి డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి

ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10వేలు ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన.
‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉప సంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10వేలకు మించి చేసే నగదు విత్ డ్రాయల్స్ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు అథెంటికేషన్ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేశీలు జరగకుండా నిరోధిస్తుంది’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది.
ప్రభుత్వ రంగంలోని ఎస్బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే.