SBI కస్టమర్లకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి

  • Published By: vamsi ,Published On : June 22, 2020 / 08:30 AM IST
SBI కస్టమర్లకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి

Updated On : June 22, 2020 / 8:30 AM IST

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్ అయితే సైబర్ దాడులకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. COVID-19 పేరిట నకిలీ E-మెయిళ్ళను పంపడం ద్వారా మోసగాళ్ళు ప్రజల వద్ద నుంచి తమ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించారని బ్యాంక్ వినియోగదారులకు వెల్లడించింది.

ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్న బ్యాంక్ వినియోగదారులను అప్రమత్తంగా ఉండమని కోరింది. ఇటీవల, ఢిల్లీ సైబర్ సెల్ ప్రజలు తమ బ్యాంక్ సంబంధిత సమాచారాన్ని వాట్సాప్‌లో పంచుకోవద్దని హెచ్చరించింది. 

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సైబర్ దాడులు జరగబోతున్నాయని మాకు అలాంటి సమాచారం అందినట్లుగా ఎస్‌బిఐ ట్వీట్‌లో రాసింది. Ncov2019@gov.in నుండి వచ్చే ఈ మెయిళ్ళపై క్లిక్ చేయకుండా ఉండాలని కోరింది. ‘ఉచిత COVID-19 పరీక్ష’ పేరిట మోసగాళ్లు సైబర్ క్రైమ్‌లకు పాల్పడుతున్నట్లు చెప్పింది. 

సైబర్ నేరస్థులు సుమారు 20 లక్షల మంది భారతీయుల ఈ మెయిల్ ఐడిలను దొంగిలించారని ట్వీట్ ద్వారా SBI తెలిపింది. కరోనా పరీక్ష పేరిట హ్యాకర్లు తమ వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని ఈ-మెయిల్ ఐడి నుంచి ఉచితంగా పొందుతున్నారు ncov2019@gov.in. నకిలీ ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ, ముంబై, చెన్నై హైదరాబాద్, అహ్మదాబాద్ ప్రజలను SBI ప్రత్యేకంగా కోరింది.

2016 లో భారత బ్యాంకింగ్ సంస్థలపై సైబర్ దాడులు జరిగాయి. ఇది దేశంలోని అనేక ఎటిఎంలను ప్రభావితం చేసింది. డెబిట్ కార్డ్ పిన్‌లతో సహా అన్ని రహస్య సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించారు. ఈ విషయంలో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఒక హెచ్చరిక జారీ చేసింది. ప్రతి ప్రభుత్వశాఖ మరియు సంస్థలకు CERT-In సూచనలు చేసింది.
 

Read:  అప్పు తీర్చేందుకు సొంత ఇంటికే కన్నం వేసిన ఇల్లాలు