Corona New Variant : మధ్యప్రదేశ్ లో ఏవై 4 కొత్త రకం కరోనా…టీకా రెండు డోసులు తీసుకున్న ఆరుగురికి సోకిన వైరస్‌

మధ్యప్రదేశ్ లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన ఆరుగురు ఏవై.4 అనే కొత్త రకం కరోనా వైరస్ సోకింది.

Corona New Variant : మధ్యప్రదేశ్ లో ఏవై 4 కొత్త రకం కరోనా…టీకా రెండు డోసులు తీసుకున్న ఆరుగురికి సోకిన వైరస్‌

New Wariant

Updated On : October 26, 2021 / 11:35 AM IST

Corona new variant in Madhya Pradesh :మధ్యప్రదేశ్ లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన ఆరుగురు ఏవై.4 అనే కొత్త రకం కరోనా వైరస్ సోకింది. వీరందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడంతో ఆందోళన రేకెత్తుతోంది. కొత్త వేరియంట్ సోకిన విషయాన్ని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం కూడా ధృవీకరించింది.

కొత్త రకం వైరస్ జన్యుక్రమాన్ని తెలుసుకునేందుకు బాధితుల నమూనాలను ల్యాబోరేటరీకి పంపినట్లు మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన అధికారి బిఎన్ సాయిత్య వెల్లడించారు. చికిత్స అనంతరం బాధితులంతా కోలుకున్నారని తెలిపారు.

Gurukul Girls School : గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

భారత్ లో కొత్తగా 12,428 కరోనా కేసులు, 356 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,63,816 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,55,068 మంది కరోనా బారిన పడి మరణించారు.