బాబా డిమాండ్ :సన్యాసులకూ భారతరత్న ఇవ్వాలి

  • Published By: chvmurthy ,Published On : January 27, 2019 / 10:35 AM IST
బాబా డిమాండ్ :సన్యాసులకూ భారతరత్న ఇవ్వాలి

Updated On : January 27, 2019 / 10:35 AM IST

ఢిల్లీ: మాకేం తక్కువ, మేంఎందులో పనికి రాకుండా పోయాం, మాకూ జాతీయ పురస్కారాలు అందించాలని డిమాండ్ చేశారు యోగాగురువు బాబా రాందేవ్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం లభించటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ళుగా భారతదేశంలో ఏ ఒక్క సన్యాసి కి ప్రభుత్వం  భారతరత్న ఇచ్చి గౌరవించలేదని ఆయన అభిప్రాయ పడ్డారు. 
దేశంలో ఇప్పటి వరకు ఏ  ఒక్క సన్యాసికి భారతరత్న ఇవ్వకపోవటం దురదృష్టకరం అని ఆయన  అన్నారు. మహరుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి లాంటి ప్రముఖులను కూడా ప్రభుత్వం గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా ప్రభుత్వం  సన్యాసులను గుర్తించి  భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నానని రాందేవ్ అన్నారు.