Samvardhinee Nyas: పిల్లలు కడుపులో ఉండగానే రామాయణం, గీత చెప్పాలట.. కొత్త ప్రచారం ప్రారంభించిన ఆర్ఎస్ఎస్

సంవర్ధినీ న్యాస్ అనేది ఆర్‌ఎస్‌ఎస్ మహిళా విభాగానికి చెందిన రాష్ట్ర సేవికా సమితికి చెందినది. కాగా, ఈ ప్రచారం కింద కనీసం 1,000 మంది మహిళలకు చేరువ కావాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా, న్యాస్ ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించారని, ఇందులో ఎయిమ్స్-ఢిల్లీకి చెందిన పలువురు గైనకాలజిస్టులు హాజరైనట్లు మరాఠె తెలిపారు.

Samvardhinee Nyas: పిల్లలు కడుపులో ఉండగానే రామాయణం, గీత చెప్పాలట.. కొత్త ప్రచారం ప్రారంభించిన ఆర్ఎస్ఎస్

Babies In Womb To Get Gita, Ramayana Lessons Under RSS Arm's New Exercise

Updated On : March 6, 2023 / 6:20 PM IST

Samvardhinee Nyas: పిల్లలు ఎదిగే వయసులోనే మంచి బుద్ధులు నేర్పాలని అంటుంటారు. అయితే ఆర్ఎస్ఎస్ అంతకంటే ముందే నేర్పాలని అంటోంది. పిల్లలు కడుపులో ఉన్నప్పుడే వారికి రామాయణం, భగవద్గీత లాంటివి నేర్పిస్తే ఎదిగే వయసులో ఉన్నతంగా తయారవుతారని ‘గర్భ సంస్కార్’ అనే కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సంవర్ధినీ న్యాస్. సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు లాంటివి గర్భంలో ఉండగానే నేర్పించాలని సందర్ధినీ న్యాస్ జాతీయ కార్యదర్శి మాధురి మరాఠె సోమవారం అన్నారు.

Maharashtra: సీఎంకు రక్తంతో ఆహ్వాన లేఖ రాసి, ఉల్లి పంటను తగలబెట్టిన రైతు

గైనకాలజిస్టులు, ఆయుర్వేదిక్ డాక్టర్లు, యోగా నిపుణుల ఈ బాధ్యత ఉందని మరాఠె అన్నారు. గర్భంలో ఉన్న శిశువులకు సాంస్కృతిక విలువలను అందించడానికి ప్రణాళికలో భాగంగా గర్భధారణ సమయంలో గీతా పఠనం, రామాయణం, యోగాభ్యాసంతో కూడిన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లలోపు శిశువుల వరకు కొనసాగుతుందని.. గీతా శ్లోకాలు, రామాయణ చౌపాయిలను పఠించడంపై దృష్టి సారిస్తుందని అన్న మరాఠె.. గర్భంలో ఉన్న శిశువు 500 పదాల వరకు నేర్చుకోగలదని పేర్కొన్నారు.

Twitter: మస్క్ కొత్త నిర్ణయం.. ట్వీట్ లిమిట్ 208 నుంచి 10,000లకి జంప్