Maharashtra: సీఎంకు రక్తంతో ఆహ్వాన లేఖ రాసి, ఉల్లి పంటను తగలబెట్టిన రైతు

మహారాష్ట్రలో ఈసారి ఉల్లి దిగుబడి పెరిగింది. అదే సమయంలో ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా తగ్గాయి. కొద్ది రోజుల క్రితం షోలాపూర్ మార్కెట్లో ఒక రైతు ఉల్లి అమ్మగా ఒక రూపాయికి కిలో అమ్ముడు పోయింది. 502 కిలోల ఉల్లి అమ్మితే రవాణా చార్జీలు 500 పోను.. ఆ రైతుకు 2 రూపాయలు చేతికి వచ్చాయి.

Maharashtra: సీఎంకు రక్తంతో ఆహ్వాన లేఖ రాసి, ఉల్లి పంటను తగలబెట్టిన రైతు

Maharashtra Farmer Burns Own Onion Crop After Not Getting Right Prices

Maharashtra: ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం కనీస ధరైనా కేటాయించడం లేదని తీవ్ర ఆవేదనకు గురైన మహారాష్ట్రకు చెందిన ఒక రైతు తాను పండించిన ఉల్లిని పొలంలోనే తగలబెట్టాడు. అయితే ఈ దహన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండేకు తన రక్తంతో లేఖ రాశాడు. రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలోని యోలా తాలుకాలో జరిగిన ఘటన ఇది. రైతు పేరు క్రిష్ణ డోంగ్రే. 1.5 ఎకరాల్లో ఉల్లి పంట వేశాడు. అయితే ఉల్లి కనీస మద్దతు ధర కూడా పలకడం లేదు. ఆ పంట కోసం నాలుగు నెలలు కష్టపడటమే కాకుండా ఇప్పటికే 1.5 లక్షల రూపాయలు ఖర్చు చేశాడట డోంగ్రే.

Shashi Tharoor: అందం, తెలివి గురించి యువతి అడిగిన ప్రశ్నకి శశి థరూర్ ఎపిక్ రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో

ఇక దాన్ని మార్కెట్‭కు తరలించడానికి మరో 30,000 రూపాయలు అయ్యేవట. అయితే తాను పండించిన ఉల్లికి మార్కెట్ వరకు తీసుకెళ్లి అమ్మితే కేవలం 25,000 మాత్రమే వస్తాయి. దీంతో ఎక్కడికీ తీసుకెళ్లలేక, తన పొలంలోనే ఉల్లిపంటను తగటబెట్టేశాడు. ఈ విషయమై డోంగ్రే మాట్లాడుతూ ‘‘నాలుగు నెలల పాటు పగలు, రాత్రి తెలియకుండా రెక్కల కష్టం చేశాను. 1.5 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల కారణంగా నా పంటను ఈరోజు నేను తగలబెట్టాల్సి వచ్చింది’’ అని కన్నీరుమున్నీరు అయ్యాడు.

Sanjay Raut: సీబీఐ, ఈడీలను తాలిబన్లతో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్

‘‘ఉల్లిని పండించడానికే నాకు చాలా డబ్బు ఖర్చైంది. దీన్ని అమ్మితే వచ్చే ఆదాయం కంటే అమ్మకానికి నాకయ్యే ఖర్చే ఎక్కువ. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించాలి. రైతులకు ఏదో ఒకటి చేస్తామని కూడా ప్రభుత్వం ఒక మాట చెప్పడం లేదు’’ అని డోంగ్రే అన్నారు. అయితే రక్తంతో లేఖ రాయడంపై అతడు స్పందిస్తూ రైతుల పరిస్థితి తెలియజేసేందుకే రక్తంతో రాశానని అన్నారు. రైతుల పంటల్నీ కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనాలని రైతు డోంగ్రే డిమాండ్ చేశారు.

Manish Sisodia: మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు

కాగా, మహారాష్ట్రలో ఈసారి ఉల్లి దిగుబడి పెరిగింది. అదే సమయంలో ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా తగ్గాయి. కొద్ది రోజుల క్రితం షోలాపూర్ మార్కెట్లో ఒక రైతు ఉల్లి అమ్మగా ఒక రూపాయికి కిలో అమ్ముడు పోయింది. 502 కిలోల ఉల్లి అమ్మితే రవాణా చార్జీలు 500 పోను.. ఆ రైతుకు 2 రూపాయలు చేతికి వచ్చాయి. ఇక దేశంలో పెద్దదైన నాసిక్ ఉల్లి మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు. చాలా మంది రైతులు మార్కెటుకు తెచ్చిన ఉల్లిని అమ్మకుండానే వదిలి వెళ్తుండగా, మరికొంత మంది రైతులు డోంగ్రేలాగ పొలంలోనే తగలబెడుతున్నారు.