Love Jihad: హిందూ యువతితో ప్రయాణిస్తున్న ముస్లింపై భజరంగ్ దళ కార్యకర్తల దాడి

హిందూ మహిళతో కలిసి ప్రయాణిస్తున్న ముస్లిం వ్యక్తిని బలవంతంగా ట్రైన్ లో నుంచి దింపేశారు భజరంగ్ దళ కార్యకర్తలు. ఆ తర్వాత అతణ్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి రైల్వే పోలీసులకు అప్పగించారు.

Love Jihad: హిందూ యువతితో ప్రయాణిస్తున్న ముస్లింపై భజరంగ్ దళ కార్యకర్తల దాడి

Love Jihad

Updated On : January 19, 2022 / 11:45 AM IST

Love Jihad: హిందూ మహిళతో కలిసి ప్రయాణిస్తున్న ముస్లిం వ్యక్తిని బలవంతంగా ట్రైన్ లో నుంచి దింపేశారు భజరంగ్ దళ కార్యకర్తలు. ఆ తర్వాత అతణ్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి రైల్వే పోలీసులకు అప్పగించారు. లవ్ జిహాద్ కు పాల్పడుతున్నాడంటూ చెప్పడంతో ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించారు. అతణ్ని స్టేషన్ కు తీసుకెళ్తుండగా యువతి అతని వెంటే వెళ్లింది.

పోలీస్ స్టేషన్ కు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఇరు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తేలింది. వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకుని ఇళ్లకు పంపించారు.

భజరంగ్ దళ్ సభ్యులపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. జనవరి 14న జరిగిన ఘటనలో యువతితో ప్రయాణించిన వ్యక్తి పేరు ఆసిఫ్ షేక్ గా గుర్తించారు. అతనొక చిన్న ఎలక్ట్రానిక్ షాప్ నడుపుకుంటుండగా, యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: చైనా నుంచి మరిన్ని డ్రోన్లు కొనుగోలు చేసిన పాకిస్తాన్

స్టేషన్ కు తీసుకెళ్తుండగా తీసిన వీడియోలో ముగ్గురు భజరంగ్ దళ్ సభ్యులు.. ఆసిఫ్ ను రైల్లో నుంచి ఈడ్చుకుంటూ కిందకు దించారు. వెనుకే పరిగెత్తుకుంటూ వస్తున్న యువతి ‘మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనొక స్కూల్లో పనిచేస్తున్నాను. పిల్లలకు పాఠాలు చెప్తాను’ అంటుండగా భజరంగ్ దళ్ సభ్యుల్లో ఒకరు మేం నీతో మాట్లాడటం లేదని సమాధానం చెప్పినట్లుగా ఉంది.

‘అతనిపై చేయిచేసుకున్నారు. అయినప్పటికీ ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు’ అని యువతి వెల్లడించింది.

కుందన్ వీహెచ్పీ మాల్వా ప్రాంట్ అయిన ప్రచార్ ప్రముఖ్ కుందన్ చాంద్రావత్ మాట్లాడుతూ.. వీళ్లు భజరంగ్ దళ్ స్టూడెంట్స్ వింగ్ అని.. ఓ హిందూ యువతిని ముస్లిం వ్యక్తి మిస్ లీడ్ చేస్తున్నాడంటూ సమాచారం రావడంతో ఇలా జరిగిందని అన్నారు.

ఇది కూడా చదవండి : ఎన్ ఐఆర్ డీపీఆర్ లో ఖాళీల భర్తీ