Mumbai : ట్రాన్స్‌జెండర్లు నిర్వహిస్తున్నకేఫ్.. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
ముంబయిలో ట్రాన్స్‌జెండర్లు కేఫ్ నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌కి భిన్నంగా ఇక్కడ వీరు అందిస్తున్న ఫుడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ కేఫ్‌లో ప్రత్యేకతలు ఏంటి? చదవండి.

Mumbai
Mumbai : ముంబయిలో ట్రాన్స్‌జెండర్లు నిర్వహిస్తున్న కేఫ్ ఫుడ్ లవర్స్‌కి అడ్డాగా మారింది. వారు అందిస్తున్న వంటకాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అక్కడ కేఫ్‌లో ప్రత్యేకతలు ఏంటి? చదవండి.
Asian Games 2023: జాతీయ గీతాలాపన సమయంలో కన్నీరు పెట్టుకున్న యువ క్రికెటర్.. వీడియో వైరల్
ముంబయి అంథేరీ వెస్ట్‌లో ఉన్న ‘బంబై నజారియా కేఫ్’ను ట్రాన్స్‌జెండర్లు నిర్వహిస్తున్నారు. రుచికరమైన ఆహార పదార్ధాలతో ఫుడ్ లవర్స్‌కి ఈ కేఫ్ స్వర్గథామంలా మారింది. ఫుడ్ బ్లాగర్లు నిఖిల్, సంకేత్ ఈ కేఫ్ గురించి వివరాలు వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్‌లో షేర్ అయిన వీడియోలో పిహు, సోనియా, విషా అనే ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు కేఫ్‌ను నిర్వహిస్తున్నట్లు తమను పరిచయం చేసుకున్నారు. కీమా పావ్, మిసల్ పావ్, క్రోసెంట్స్, స్టప్ట్ మోమోస్, రిచ్ కర్రీ ఐటమ్స్, శాండ్ విచ్‌లు పలు రకాల సోడాలు వీటితో పాటు స్పెషల్ పింక్ చాయ్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ట్రాన్స్‌జెండర్లతో పాటు ముగ్గురు స్పెషల్ చైల్డ్స్ కూడా ఇక్కడ పనిచేస్తుండటం విశేషం. ఈసారి ముంబయి వెళ్తే ‘బంబై నజారియా’కి వెళ్లడం మర్చిపోకండి.
View this post on Instagram