స్కూల్ టీచర్‌కు గిఫ్ట్‌గా రూ.30 లక్షలు విలువైన షేర్లు ఇచ్చిన బ్యాంక్ సీఈఓ

క్లిష్ట సమయాల్లో ఆదుకున్న లెక్కల టీచర్‌ను ఆదుకున్న Bank CEO ఔన్నత్యాన్ని, మంచితనాన్ని చాటుకున్నాడు. IDFC First bank ఎండీ, సీఈఓ వి వైద్యానాథన్ మాజీ లెక్కల టీచర్‌కు లక్ష ఈక్విటీ షేర్లు గిఫ్ట్ గా ఇచ్చి రూ.30లక్షలు దక్కేలా చేశాడు. తాను తొలి రోజుల్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేందుకు అప్పుగా డబ్బులు ఇచ్చేవాడట.
ఇప్పుడు ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెన్నైకు చెందిన వైద్యనాథన్.. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మెస్రా)లో ఇంజినీరింగ్ కోర్స్ పూర్తి చేశారు. ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేందుకు కౌన్సిలింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆ సమయంలో గుర్డియాల్ సైనీ అతనికి రూ.500 అప్పుగా ఇచ్చి ఆదుకున్నాడు.
కోర్సులో క్వాలిఫై అయ్యాక ప్రొఫెషనల్ గా నిలదొక్కుకున్నాక ఆ మాజీ టీచర్ ను కలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాడు వైద్యనాథన్. కానీ, ఇప్పటికీ అది కుదరలేదు. ఈ నెలారంభంలో సైనీకి లక్ష ఈక్విటీ షేర్లు ట్రాన్సఫర్ చేసినట్లుగా బ్యాంకు స్టేట్‌మెంట్ లో పేర్కొంది.
‘SEBI ఇన్‌సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. వైద్యనాథన్ లక్ష ఈక్విటీ షేర్లను IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అతని మాజీ స్కూల్ టీచర్ గుర్డియాల్ సరూప్ సైనీకి గిఫ్ట్ గా ఇస్తున్నారు. కెరీర్ తొలి రోజుల్లో చేసిన సాయానికి గుర్తుగా ఇలా చేశారు’ అని నోటీస్ లో పేర్కొంది.