Bank of India: గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్ తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆదివారం మరోసారి ప్రకటించింది. గృహ, వాహన రుణాలపై 35బేసిస్ పాయింట్, 50 బేసిస్ పాయింట్ ల ఆధారంగా తగ్గించింది.

Bank of India: గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్ తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

interest-rates-on-home-loans

Updated On : October 17, 2021 / 9:11 PM IST

Bank of India: బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆదివారం మరోసారి ప్రకటించింది. గృహ, వాహన రుణాలపై 35బేసిస్ పాయింట్, 50 బేసిస్ పాయింట్ ల ఆధారంగా తగ్గించింది. వడ్డీ రేటు తగ్గింపు ప్రభావంతో ఇంటి రుణాలు 6.85శాతం నుంచి 6.50శాతానికి తగ్గింది. వాహనాల రుణాలు 7.35శాతం నుంచి 6.85శాతానికి తగ్గిందని బ్యాంకు స్టేట్మెంట్ లో పేర్కొంది.

ప్రత్యేక వడ్డీ రేటు 2021 అక్టోబర్ 18 నుంచి 2021 డిసెంబర్ 31వరకూ అందుబాటులో ఉంటుంది. పైగా ఇది ఫ్రెష్ గా లోన్ తీసుకునేవారికి లోన్లు ట్రాన్సఫర్ చేసుకోవాలనుకునేవారికి మాత్రమే అప్లై అవుతుంది. ఈ మేరకు చేసిన ప్రకటనలో వడ్డీ రేట్లు తగ్గింపు అనేది 31 డిసెంబర్ 2021 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది.

………………………………………..: జాబ్స్ అప్లై చేసుకోండి.. కేవలం హిందువులకు మాత్రమే