Punjab Politics : రాజీనామాకి సిద్ధమైన పంజాబ్ సీఎం..సిద్ధూ సీఎం బాధ్యతలు తీసుకోవాలన్న చన్నీ!

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్‌లో ఇంటి గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్

Punjab Politics : రాజీనామాకి సిద్ధమైన పంజాబ్ సీఎం..సిద్ధూ సీఎం బాధ్యతలు తీసుకోవాలన్న చన్నీ!

Punjab

Updated On : October 20, 2021 / 10:07 PM IST

Punjab Politics  వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్‌లో ఇంటి గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. పార్టీ,ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అనేక సమస్యలపై సిద్ధూ మరియు చన్నీల మధ్య కొనసాగుతున్న గొడవలు కొనసాగుతున్నాయి.

ఆదివారం జరిగిన పార్టీ సీనియర్ నేతల కీలక సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై సిద్ధూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం చన్నీ.. మీరు సీఎం పదవిని తీసుకుని, రెండు మాసాల్లో ఏం చేస్తారో చేసి చూపించాలని సిద్ధూకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం నాటి సమావేశంలో సీఎం చన్నీ-సిద్ధూ మధ్య వాగ్యుద్ధం కాస్త తీవ్రంగానే సాగినట్లు తెలుస్తోంది.

సిద్ధూ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చన్నీ స్పష్టంచేసినట్లు సమాచారం. పార్టీ పరిశీలకుడు హరీశ్ చౌదరీ, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కృష్ణ అల్లవరు, పంజాబ్ కేబినెట్ మంత్రి ప్రగత్ సింగ్ సమక్షంలోనే ఇదంతా జరిగినట్లు సమాచారం. కాగా, సీఎం చన్నీనుద్దేశించి సిద్ధూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చన్నీ ముంచుతాడని సిద్ధూ మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో కన్పించింది.

ALSO READ Goa Congress : గోవాలో కాంగ్రెస్ కి మరో బిగ్ షాక్..ఆప్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం