Mallikarjun Kharge : బీజింగ్ జనతా పార్టీగా మారిన బీజేపీ!

బీజేపీ నాయకులు కొందరు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి నకిలీ ఫొటోలను షేర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆరోపించారు.

Mallikarjun Kharge : బీజింగ్ జనతా పార్టీగా మారిన బీజేపీ!

Kharge

Updated On : November 27, 2021 / 8:16 PM IST

Mallikarjun Kharge : బీజేపీ నాయకులు కొందరు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి నకిలీ ఫొటోలను షేర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆరోపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో గ్రామాలను నిర్మించేందుకు బీజేపీ ప్రభుత్వం చైనాను అనుమతించిందన్నారు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం.. చైనాలని బీజింగ్ లోని డాక్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను తమ సొంత ఎయిర్ పోర్ట్(నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) గా చూపిస్తోందని ఖర్గే శనివారం చేసిన ఓ ట్వీట్ లో విమర్శించారు. లడఖ్‌లో మన భూభాగాన్ని బీజేపీ ప్రభుత్వం చైనాకు అప్పగించిందని ఖర్గే విమర్శించారు. బీజేపీ..బీజింగ్ జనతా పార్టీగా రూపాంతరం చెందిదని విమర్శించారు.

ALSO READ Ganja in Amazon: అమెజాన్‌లో గంజాయి స్మగ్లింగ్!