PM MODI-Mamata Meeting :మోదీతో మమత భేటీ!

వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

PM MODI-Mamata Meeting :మోదీతో మమత భేటీ!

Modi

Updated On : July 22, 2021 / 10:04 PM IST

PM MODI-Mamata Meeting  వచ్చే వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ నెల 28 న మోదీ-మమత భేటీ జరగనుంది. గురువారం కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ…రెండు,మూడు రోజులు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నా. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమయం ఇస్తే ఆయన్ను కలుస్తా. ప్రధాని నరేంద్ర మోదీ నాకు సమయం ఇచ్చారు. ఆయనతో సమావేశమవుతా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం తర్వాత మమత ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే కేంద్రంలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం నడుస్తున్న సమయంలో మమత ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.