మహిళా సీఐడీ ఆఫీసర్ ఆత్మహత్య

Lady CID officer commits suicide:బెంగళూరులో ఒక లేడీ సీఐడీ ఆఫీసర్ బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. డీఎస్పీ ర్యాంక్ అధికారి అయిన 33 ఏళ్ల నేర పరిశోధన విభాగంలో పోస్టింగ్‌లో ఉన్నారు. తన ఫ్రెండ్ ఇంటికి విందు కోసం వెళ్లిన ఆమె.. తన జీవితాన్ని అక్కడే ముగించింది. రాత్రి 10గంటల 30నిమిషాల సమయంలో ఆమె గదిలో పైకప్పుకు వేలాడుతూ కనిపించింది.
2014లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(KPSC)లో ర్యాంకు కొట్టిన తరువాత లక్ష్మీ సిఐడిలో చేరారు. ఆమె 2017లో సీఐడీలో చేరగా.. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్నేశ్వరి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో డీఎస్పీగా పని చేస్తున్నారు. తన స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లిన లక్ష్మి.. గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టారు. ఈ సమయంలోనే ఆమె ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్న లక్ష్మీకి సంతానం లేదు. సంతానం లేదనే బాధతో లక్ష్మీ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.