Traffic Police : హెల్మెట్ ధరించలేదని ఫైన్ .. సాక్ష్యం ఏదంటూ సోషల్ మీడియాలోకెక్కిన యువకుడికి దిమ్మతిరిగే ఫోటో పంపిన పోలీసులు..
హెల్మెట్ ధరించలేదని ఫైన్ వస్తే..దానికి సాక్ష్యం ఏదంటూ సోషల్ మీడియాలోకెక్కాడు ఓ యువకుడు. దానికి పోలీసులు దిమ్మతిరిగే ఫోటో పంపించేసరికి దారికొచ్చాడు. సర్లే కట్టేస్తాలే అయినా అడగటం నా హక్కు అంటూ చెప్పుకొచ్చాడా యువకుడు.పోలీసులు..

Bengaluru man fined for not wearing helmet, police challenge to ‘provide evidence’, gets epic response
హెల్మెంట్ లేకుండా వాహనం నడిపితే పోలీసులు ఆ వాహనం (టూ వీలర్) నంబర్ ఫోటో తీసి ఫైన్ కట్టాలని మెసేజ్ పంపిస్తారు. సాధారణంగా ఎవ్వరైనా ఫైన్ కట్టేస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం నేను హెల్మెట్ ధరంచలేదంటూ నా వాహనం నంబర్ మాత్రమే పంపించారు. నేను హెల్మెట్ ధరించలేదనటానికి ఈ సాక్ష్యం సరిపోదు..తాను హెల్మెట్ ధరించలేదని సాక్ష్యం చూపిస్తేనే జరిమానా కడతాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోలీసులను ప్రశ్నించాడు. దీనికి పోలీసులు సదరు యువకుడికి దిమ్మతిరిగే రిప్లై ఇవ్వటంతో ‘సర్లే కట్టేస్తాలే’అంటూ దారి కొచ్చాడు.
కర్ణాటకలోని బెంగళూరులో ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్‌పై దూసుకుపోతున్న ఫొటోను అతడికి పంపిన ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కానీ మీరు పంపించిన ఫొటోలో నంబరు ప్లేట్ మాత్రమే కనిపిస్తుంది..ఆ ఫోటోలో నేను హెల్మెట్ ధరించలేదు అనటానికి ఎటువంటి ఆధారమూ లేదు..కాబట్టి నేను జరిమానా కట్టను..గతంలో కూడా ఇలాగే పోనీలే కదాని కట్టాని ఇప్పుడు నేను కట్టేది లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పోలీసులు సమాధానం ఇచ్చాడు. అంతేకాదు మీరు పూర్తి సాక్ష్యాధారాలతో ఫోటో పంపిచస్తే కడతాను లేదంటే జరిమానా కట్టే ప్రసక్తే లేదని..సాక్ష్యంగా పూర్తి ఫొటో అయినా పంపాలని, లేదంటే కేసును అయినా వెనక్కి తీసుకోవాలంటూ తెగేసి చెప్పాడు.
ఈ ట్వీట్ చూసిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే పూర్తి ఫొటో పంపడంతో యువకుడు కంగుతిన్నాడు. ఇది చూసిన యువకుడు పూర్తి ఫొటో పంపినందుకు ధన్యవాదాలు చెబుతూ.. జరిమానా చెల్లిస్తానని చెప్పుకొచ్చాడు. అక్కడితో సదరు యువకుడు ఊరుకోకుండా ఏమాత్రం తగ్గకుండా ఓ పౌరుడిగా తెలుసుకునే హక్కు ఉండడం వల్లే ప్రశ్నించానని జరిమానా కట్టేస్తాను అంటూ తొలుత చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.పోలీసులు, యువకుడు మధ్య జరిగిన ట్వీట్ల పోరుపై నెటిజన్లు స్పందించారు. అతడు హెల్మెట్ పెట్టుకోకపోవడమే కాకుండా ఇయర్ ఫోన్స్ ధరించి ఉన్నాడని..కాబట్టి మరింత ఎక్కువ ఫైన్ వేయాలని సూచించారు.