బెంగళూరు హింసపై సీఎం కీలక నిర్ణయం…ప్రతి పైసా నిందితులనుంచే వసూలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 17, 2020 / 09:56 PM IST
బెంగళూరు హింసపై సీఎం కీలక నిర్ణయం…ప్రతి పైసా నిందితులనుంచే వసూలు

Updated On : August 18, 2020 / 10:11 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు అల్లర్లపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హింసాకాండలో అల్లరిమూకల విధ్వంసంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబడతామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం వెల్లడించారు. అల్లరిమూకను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమని హెచ్చరించారు.



బెంగళూరులో చోటు చేసుకున్న ఘటనలు ఏ మాత్రం ఉపేక్షించదగ్గవి కావని యడియూర్ప అన్నారు. ఈ కేసును విచారించేందుకు ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేశామని, కేసుల సత్వర విచారణకు ముగ్గురు ప్రత్యేక ప్రాసికూటర్లను నియమిస్తామని యడియూరప్ప పేర్కొన్నారు. ఈ కేసును విచారించేందుకు ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేశామని, కేసుల సత్వర విచారణకు ముగ్గురు ప్రత్యేక ప్రాసికూటర్లను నియమిస్తామని యడియూరప్ప పేర్కొన్నారు.



జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రాబడతామని ఆయన స్పష్టం చేశారు. నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టును కోరుతామని అన్నారు. క్లెయిమ్ కమిషనర్‌ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు వేస్తామని చెప్పారు. అవసరమైతే నిందితులపై గూండా యాక్ట్‌ను సిట్‌ ప్రయోగిస్తుందని యడియూరప్ప ట్వీట్‌ చేశారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలను బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.



గతవారం, బెంగళూరులోని కేజీ హళ్లీ, డీజే హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో అల్లరి మూకలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి నివాసంపై దాడి చేశారు. ఆయన ఇంటిని తగులబెట్టారు. ఈ ఘటనలో మూడంతస్తుల ఈ భవనం మొత్తం కాలిపోయింది. పులకేశినగర నియోజకవర్గం పరిధిలోని కావల్ బైరసంద్ర సహా పరిసర ప్రాంతాల్లో కనిపించిన వాహనాన్ని కనిపించనట్టే తగులబెట్టారు. బుగ్గిపాలు చేశారు. అక్కడితో ఆగని అల్లరిమూకలు డీజే హళ్లీ పోలీస్‌స్టేసన్‌పైనా దాడులు చేశారు. పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 300 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు పోలీసులు. అల్లర్లలో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.