Rahul Gandhi : ప్రతి భారతీయుడి గొంతుగా భారత్ మాత…రాహుల్ గాంధీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Rahul Gandhi
Rahul Gandhi On Independence Day : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి గొంతుక భారత్ మాత అని రాహుల్ పేర్కొన్నారు. (Rahul Gandhi) సముద్రం అంచున కన్యాకుమారి నుంచి మంచు కశ్మీరు వరకు తన 145 రోజుల భారత్ జోడో పాదయాత్ర అనుభవాన్ని రాహుల్ ఈ సందర్భంగా పంచుకున్నారు. (Rahul Gandhi On Independence Day) ‘‘భారత మాత ప్రతి భారతీయుడి గొంతు! దేశవాసులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
Tomatoes : ఆగస్టు 15 నుంచి రూ.50కి తగ్గిన టమాటాల ధర
‘‘గత (Bharat Mata Is Voice Of Every Indian) సంవత్సరం నేను భరత భూమి మీదుగా 145 రోజులు నడిచాను, సముద్రం అంచున ప్రారంభించి వేడి, దుమ్ము, వర్షం గుండా నడిచాను. అడవులు, పట్టణాలు, కొండల గుండా మృదువైన కశ్మీర్ మంచు ప్రాంతానికి చేరుకున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు.
Nigeria : నైజీరియాలో ముష్కరుల దాడి..26 మంది సైనికుల మృతి, కూలిన హెలికాప్టర్
యాత్రను కొనసాగిస్తున్నప్పుడు తాను ఎదుర్కొన్న బాధ, యాత్రను కొనసాగించడంలో తనకు సహకరించిన ప్రేరణను కూడా ఆయన ప్రస్థావించారు. ‘‘నడక యాత్ర సందర్భంగా నా పాత మోకాలి గాయంతో ఫిజియో థెరపీ చేయించుకున్నాను, నొప్పితో యాత్ర ఆపేయాలని అనుకున్న ప్రతీసారి పలువురు వచ్చి నాకు శక్తిని బహుమతిగా ఇచ్చారు’’ అని రాహుల్ చెప్పారు.