ఉల్లి బంగారమాయే : కిలో రూ.120

  • Published By: veegamteam ,Published On : November 6, 2019 / 06:01 AM IST
ఉల్లి బంగారమాయే : కిలో రూ.120

Updated On : November 6, 2019 / 6:01 AM IST

ఉల్లిపాయలు ఘాటు కోసేటప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. కానీ కొయకుండానే కంట నీరు పెట్టిస్తోంది అనే మాట ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. ఉల్లి కళ్లనుంచే కాదు..జేబుల నుంచి కూడా కన్నీరు పెట్టిస్తోంది. భారీ వర్షాలకు ఉల్లి పంటలు నాశనం కావటంతో మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంతో ఉల్లిపాయలు పోటీ పడుతున్నాయా అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లో మరింత ఘాటు రేటు పలుకుతున్నాయి.

ఆగస్టు, సెప్టెంబర్‌ lనెలల్లో కిలో ఉల్లి ధర రూ. 80 పలికిన విషయం తెలిసిందే. కానీ తరువాత ఎక్కువగా కాకపోయినా కొద్దిగా దిగి వచ్చింది. కానీ మళ్లీ ఉల్లి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. మధ్యప్రదేశ్ లోని  మార్కెట్ లో కిలో ఉల్లిపాయలు రూ.80 నుంచి రూ.90 కూడా అమ్ముతున్నారు. కానీ మార్కెట్ కు  ఉల్లి దిగుమతి తగ్గిపోవటంతో మరింతగా ఉల్లి ఘాటు పెరగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో  కిలో ఉల్లి ధర రూ.100లకు చేరువైనట్టు కనిపిస్తోంది. భోపాల్ లో కిలో ఉల్లిపాయలు ప్రస్తుతం 80 రూపాయలకు విక్రయిస్తుండగా…దిగుమతి తగ్గిపోవటంతో ఈ ధర భారీగా పెరిగి..కిలో రూ. 120 కి పెరిగే అవకాశముందని అంటున్నారు.  అంటే ఒకేసారి రూ.40 పెరగనుంది. దీంతో ప్రజలు హడలిపోతున్నారు.