బిగ్ బ్రేకింగ్ : భారత్‌లో కరోనా..ఐదో మృతి

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 05:44 AM IST
బిగ్ బ్రేకింగ్ : భారత్‌లో కరోనా..ఐదో మృతి

Updated On : March 20, 2020 / 5:44 AM IST

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారం సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరొకరు మృతి చెందారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఇటలీ టూరిస్టు కరోనా వైరస్‌తో జైపూర్‌లో మృ‌తి చెందాడు. ఇతడికి కిడ్నీ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ వైరస్ సోకిన..మృతుడి భార్య మాత్రం కోలుకొంది. కరోనాతో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. ఒక విదేశీయుడు కూడా చనిపోయాడు. 

ఇటలీ నుంచి ఓ బృందం ఇటీవలే భారత్‌కు వచ్చింది. జైపూర్‌లో పర్యటిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో..వీరిని వైద్యులు పరీక్షించారు. అందులో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ప్రత్యేక వార్డులో ఇతనికి చికిత్స అందించారు. కానీ..ఇతను చనిపోవడంతో..మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200కు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అత్యవసరమైతే..తప్ప..బయటకు రావద్దని సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా వైరస్ లక్షణాలు కనబడుతున్నాయి. 

Read More : నిర్మానుష్యంగా అలిపిరి : కరోనా భయం..మార్గాలను మూసేసిన టీటీడీ