పొత్తులు కుదిరాయ్.. సీట్ల లెక్కలు ఇవే.. బీజేపీ 121 స్థానాల్లో!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు), బీజేపీ సీట్ల పంపిణీపై ఓ అవగాహనకు వచ్చాయి. అయితే తమకూటమితో చేతులు కలిపితేనే అని షరతు విధించింది.ఈ నెల 28 నుంచి మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మహాకూటమి ఏర్పాటైన తరువాత, ఎన్డీఏతో సీట్లు ఒప్పందం చేసుకున్న జేడీయూ.. 122 సీట్లలో జేడీయూ పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. మొత్తం 243 స్థానాలకు గాను జేడీ-యు 122 సీట్లకు, బీజేపీ 121 స్థానాలకు పోటీ చేయనుండగా.. 50 : 50 ఫార్ములాను పొత్తులో పార్టీలు అనుసరిస్తూ ఉండగా.. జితన్ రామ్ మంఝి ఆధ్వర్యంలోని హిందుస్తానీ అవామీ మోర్ఛాకు జేడీ-యు ఏడు సీట్లను కేటాయించింది. అలాగే Vikassheel Insaan Party(VIP)కి బీజేపీ ఐదు సీట్లను కేటాయించింది.
ఈ సంధర్భంగా.. బిహార్ బీజేపీ నేత సంజయ్ జైశ్వాల్ మాట్లాడుతూ.. బిహార్‌లో ఎన్డీయే నాయకుడు నితీశ్ కుమారేనని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలోనే బిహార్ కూటమిలో చర్చలన్నీ జరుగుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆయన నాయకత్వాన్ని బీజేపీ ఆమోదిస్తోందని చెప్పారు. నితీశ్ కుమార్ నాయకత్వాన్ని అంగీకరించేవారే ఎన్డీయే కూటమిలో ఉన్నట్లు అని ఆయన చెప్పారు.
నితీశ్ కుమార్ నాయకత్వాన్ని అంగీకరించని లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఇటీవల ఎన్డీయే నుంచి వైదొలగింది. బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ చెరి సగం సీట్లలో పోటీ చేయాలని ఓ అవగాహనకు వచ్చాయి. బీజేపీ, జేడీయూ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.