Boiler explodes: బాయిలర్‌ పేలుడు.. 10 మంది మృతి

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆదివారం ఉదయం బాయిలర్‌ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందారు.

Boiler explodes: బాయిలర్‌ పేలుడు.. 10 మంది మృతి

Explosion

Updated On : December 26, 2021 / 1:20 PM IST

Boiler explodes: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆదివారం ఉదయం బాయిలర్‌ పేలి 10 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం SKMCHలో చేర్చారు.

పేలుడు చాలా బలంగా జరిగిందని, పేలుడు దెబ్బకు సమీపంలోని ఫ్యాక్టరీలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. పక్కనే ఉన్న చుడా, పిండి కర్మాగారం కూడా పేలుడు దెబ్బకు తీవ్రంగా దెబ్బతింది.

ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంఘటన జరిగినట్లుగా తెలుస్తుండగా.. సమాచారం అందుకున్న ముజఫర్‌పూర్‌ ఎస్‌ఎస్పీ జయంత్‌కాంత్‌ బృందం బలగాలతో అక్కడకు చేరకుని రెస్క్యూ ఆపరేషన్ సాగిస్తున్నారు.

ఘటనకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియరాలేదు. పేలుడు చాలా బలంగా జరిగిందని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. పేలుడు శబ్ధం విని ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు.

బాయిలర్ పగిలిందని ముజఫర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రణవ్ కుమార్ వెల్లడించారు. అది ఎవరి ఫ్యాక్టరీ అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు చనిపోయాగా.. గాయపడిన వారికి SKMCHలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

బాయిలర్ పేలుడు గురించి మహ్మద్ అబిద్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. మృతదేహాలు శిథిలాల కింద పడి ఉన్నాయని, జేసీబీ వస్తోందని, శిథిలాలు తొలగించి మృతదేహాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.