Caste Census: కేంద్రాన్ని కాదని, రేపే కులగణన ప్రారంభించనున్న బిహార్ ప్రభుత్వం.. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేగనున్నాయా?
ఇప్పటి వరకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) మినహా మిగిలిన కులాల జనాభా గణన జరగదని బీహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ 2021లో పార్లమెంటులో చెప్పినప్పటి నుంచి ఈ వివాదం తీవ్రమైంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేంద్రం ఇప్పటి వరకు ఏడు జనాభా గణనలను నిర్వహించింది. అయితే కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన డేటా మాత్రమే ప్రచురించింది. కానీ ఓబీసీల కులగణన చేయలేదు.

Bihar caste census starts tomorrow. What it means and why it is being done
Caste Census: బీహార్‌లోని నతీశ్ కుమార్ ప్రభుత్వం రేపు (జనవరి 7) కుల ఆధారిత జనాభా గణనను ప్రారంభించనుంది. రూ.500 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను అమితంగా ప్రభావితం చేయనున్నట్లు రాజకీయ పండితులు అంటున్నారు. వాస్తవానికి చాలా కాలంగా కుల ఆధారిత జనాభా గణన చేయాలని డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఓబీసీల స్థితిగతులను ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని దాటవేస్తూ వస్తోంది. బిహార్‌లోని అన్ని స్థానిక రాజకీయ పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. అయినప్పటికీ కేంద్రం మౌనం వీడకపోవడంతో నితీశ్ ప్రభుత్వమే తమ రాష్ట్రంలో కుల గణన చేపట్టేందుకు సిద్ధమైంది.
రెండు దశల్లో ఈ కసరత్తు చేయనున్నట్లు నితీశ్ ప్రభుత్వం వెల్లడించింది. మొదటి దశ జనవరి 21 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలను ఇందులో లెక్కిస్తారు. రెండవ దశ మార్చి నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో అన్ని కులాలు, ఉపకులాలు, మతాల ప్రజలకు సంబంధించిన డేటాను సేకరిస్తారు. ఈ విషయమై డిసెంబరు 15న శిక్షణ ప్రారంభించిన ఎన్యూమరేటర్లు ప్రజలందరి ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని కూడా నమోదు చేస్తారు.
పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు ఎనిమిది స్థాయిల్లో సర్వే చేస్తారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్‌గా డేటా సేకరిస్తారు. యాప్‌లో స్థలం, కులం, కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య, వారి వృత్తి, వార్షిక ఆదాయం గురించి ప్రశ్నలు ఉంటాయి. ఈలెక్కల సేకరణ కోసం ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ, ఉపాధి హామీ కార్యకర్తల్ని తీసుకున్నారు.
ఇప్పటి వరకు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) మినహా మిగిలిన కులాల జనాభా గణన జరగదని బీహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ 2021లో పార్లమెంటులో చెప్పినప్పటి నుంచి ఈ వివాదం తీవ్రమైంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేంద్రం ఇప్పటి వరకు ఏడు జనాభా గణనలను నిర్వహించింది. అయితే కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన డేటా మాత్రమే ప్రచురించింది. కానీ ఓబీసీల కులగణన చేయలేదు.
Sanjay Raut: మరో కేసులో ఇరుక్కున్న సంజయ్ రౌత్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
1931 జనాభా లెక్కల ప్రకారం, ఓబీసీల జనాభా దేశవ్యాప్తంగా 52 శాతంగా అంచనా వేయబడింది. కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2011లో సామాజిక-ఆర్థిక కులగణనను నిర్వహించింది. అయితే కుల డేటాను మాత్రం విడుదల చేయలేదు. కుల గణనకు అనుకూలంగా బీహార్ శాసనసభ 2018, 2019లో రెండు ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించింది. జూన్ 2022లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన బీహార్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం దీనికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
అయితే ఓబీసీల జనాభా సరిగ్గా తెలియపోవడం వల్ల రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురువతున్నాయని, అలాగే ఓబీసీల వాస్తవ స్థితిగతుల్ని ప్రభుత్వాలు అంచనా వేయలేకపోతున్నాయని విమర్శలు ఉన్నాయి. మండల్ కమిషన్ అమలులో సైతం ఈ ఇబ్బందులు తలెత్తాయి. పైగా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో రాజకీయంగా కూడా ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Jammu and Kashmir: గులాం నబీ ఆజాద్‌కు బిగ్ షాక్.. తిరిగి కాంగ్రెస్‌లో చేరిన జమ్మూ కశ్మీర్ నేతలు
1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టినప్పుడు బీజేపీ కమండల్ రాజకీయాలను ఎదుర్కొనేందుకు కేంద్రంలోని జనతాదళ్ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మండల్ కమిషన్ నివేదికను అమలు చేసింది. ఆ సమయంలో మండల్ కమిషన్ అమలుతో కమండల్ ఉద్యమాన్ని చాలా వరకు అడ్డుకోగలిగింది. అయితే మండల్ కమిషన్ అమలుపై దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఓబీసీ కులగణన చేసేందుకు సాహసించకపోవడానికి ఇదొక కారణమని చెబుతుంటారు.