Viral Video: లంచం ఇస్తేనే కొడుకు మృతదేహం ఇస్తామన్న ఆస్పత్రి సిబ్బంది.. బిక్షమెత్తుకుంటూ డబ్బుపోగుచేస్తున్న వృద్ధ జంట

బీహార్‌లో గుండెలు పిండేసే ఓ ఘటన చోటు చేసుకుంది. లంచాలకు అలవాటుపడిన కొందరు సిబ్బంది బరితెగించారు. కొడుకు మృతదేహం ఇవ్వాలంటే రూ. 50వేలు ఇవ్వాలంటూ ఓ వృద్ధ జంటను డిమాండ్ చేశారు.

Viral Video: లంచం ఇస్తేనే కొడుకు మృతదేహం ఇస్తామన్న ఆస్పత్రి సిబ్బంది.. బిక్షమెత్తుకుంటూ డబ్బుపోగుచేస్తున్న వృద్ధ జంట

Couple Begs

Updated On : March 13, 2023 / 2:45 PM IST

Viral Video: బీహార్‌లో గుండెలు పిండేసే ఓ ఘటన చోటు చేసుకుంది. లంచాలకు అలవాటుపడిన కొందరు సిబ్బంది బరితెగించారు. కొడుకు మృతదేహం ఇవ్వాలంటే రూ. 50వేలు ఇవ్వాలంటూ ఓ వృద్ధ జంటను డిమాండ్ చేశారు. వారివద్ద ఇచ్చేందుకు అంత డబ్బులేకపోవటంతో చేసేదేమీలేక ఇంటింటికి తిరిగి బిక్షమెత్తుకుంటూ డబ్బులను పోగు చేస్తున్నారు. ఈ జంటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు లంచం డిమాండ్ చేసిన ఉద్యోగులపై మండిపడుతున్నారు. మృతదేహాన్ని ఇచ్చేందుకు లంచం అడిగిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Viral News: హోంవర్క్ చేయలేదని చిన్నారిని ఎండలో పడుకోబెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..

కన్నకొడుకు కనిపించకుండా పోవటంతో బీహార్‌కు చెందిన వృద్ధ దంపతులు కొంతకాలంగా వెతుకుతున్నారు. ఈ క్రమంలో కుమారుడి ఆచూకీకోసం వారు ఆరాతీయని చోటు లేదు. అయినా ఆచూకీ దొరకలేదు. ఇటీవల నీ కొడుకు మృతదేహం సమస్తిపూర్‌లోని సదర్ హాస్పిటల్‌లో ఉందని వారికి ఫోన్ వచ్చింది. దీంతో కన్నీరుమున్నీరవుతూనే కొడుకు మృతదేహాన్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. మృతదేహం తమ కొడుకుదే అని నిర్ధారించుకొని ఇంటికి తీసుకెళ్లేందుకు అధికారులను సంప్రదించారు. ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి డిమాండ్ ను విన్నవారు ఒక్కసారిగా కంగుతిన్నారు. కొడుకు మృతదేహం కావాలంటే రూ. 50వేలు లంచం ఇచ్చుకోవాల్సిందే అంటూ ఉద్యోగి డిమాండ్ చేశాడు. ఆ వృద్ధ జంట వద్ద ఇచ్చేందుకు అంతడబ్బు లేకపోవటంతో చేసేదేమీలేక బిక్షాటన ఎత్తుకోవటం ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ఒక్కోరూపాయి పోగేసి ఆస్పత్రి ఉద్యోగి అడినట్లు లంచం ఇచ్చి కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి వ్యక్తిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సమస్తిపూర్ సివిల్ సర్జన్ వైద్యుడు ఎస్ కె చౌదరి మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, లంచం అడిగిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యులైన వారిని వదిలిపెట్టమని, ఇది మానవత్వానికి అవమానం అని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఆసుపత్రిలో చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు కాంట్రాక్టుపై పనిచేస్తున్నారు. వారి జీతాలు సకాలంలో రాకపోవడంతో రోగుల బంధువుల నుంచి డబ్బులు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.