Excise Department : మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలో మందుబాబులకు ఏసీ రూముల్లో రాచమర్యాదలు
మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలో మందుబాబులకు ఏసీ రూముల్లో రాచమర్యాదలు చేస్తోంది ప్రభుత్వం. ఓ పక్క మద్యపాన నిషేధం అంటూనే మరోపక్క మందుబాబులకు సకల సౌకర్యాలతో ఏసీ రూముల్లో పెట్టి మద్యం తాగమని చెబుతోంది.

Bihar Excise Department
Bihar : పబ్లిగ్గా మందు తాగి పట్టుబడినా..డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. శృతి మించితే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. కానీ సంపూర్ణ మద్య నిషేధం ఉన్న రాష్ట్రం బీహార్ లో మాత్రం మందుబాబులకు ఏసీ రూముల్లో రాజమర్యాదలు చేస్తోంది ప్రభుత్వం. అదేంటో మద్య నిషేధం అని ప్రకటించి మద్యం తాగితే చర్యలు తీసుకోకుండా ఈ మర్యాదలేంటీ? అనే డౌటనుమానం రానే వస్తుంది. మందుబాబులకు బీహార్ ఎక్సైజ్ శాఖ మందుబాబులకు చేసే రాచమర్యాదల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
మద్య నిషేధం అమలౌతున్న బీహార్‌లో మద్యం తాగి పట్టుబడితే రాచ మర్యాదలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకించి ఏసీ రూములను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మద్యం తాగి పట్టుబడే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలో ఓ స్థాయిలో ఉండే వ్యక్తుల కోసం వీటిని నిర్మించామని బీహార్ ఎక్సైజ్ శాఖ స్వయంగా తెలిపింది. మద్యం తాగి పట్టుబడే వీఐపీల కోసం ఏసీ రూముల్లో మంచాలు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, టేబుల్, ఏసీ సౌకర్యం కల్పించారు. అత్యాధునిక వసతులన్నీ ఈ కేంద్రంలో కల్పిస్తున్నారు. రక్షణ కోసం ప్రతి కేంద్రంలోనూ శిక్షణ పొందిన శునకాన్ని కూడా ఉంచుతున్నామని సమస్తీపూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ కే చౌదరి తెలిపారు. మద్యం తాగి పట్టుబడే వీఐపీలను ఈ కేంద్రాల్లో 24 గంటలు మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. అంతేకాదు ఇటువంటి సౌకర్యాలు రాష్ట్రం అంతా ఏర్పాటు చేస్తామంటోంది ప్రభుత్వం. ఆధునిక సౌకర్యాలున్న కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బీహార్‌లో 2016 ఏప్రిల్ నుంచి మద్య నిషేధం అమలులో ఉంది. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం సీఎం నితీశ్ కుమార్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేలా చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎవరైనా మద్య తాగి పట్టుబడితే మొదటిసారి ఫైన్ వేసి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. రెండోసారి చిక్కితే కఠిన చర్యలుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఎవరైనా మద్యం తాగి పట్టుబడితే చర్యలు తీసుకోవటం మాట పక్కన పెడితే వారిని ఏకంగా ఏసీ రూముల్లో ఉంది సకల మర్యాదలు కల్పిస్తోంది. ఓ పక్క మద్యపాన నిషేధం అంటూ మరోపక్క మందుబాబులకు స్టార్ హోటర్ ఫెసిలిటీస్ కల్పించటం ఏంటీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు.. పలుకుబడి ఉన్న వ్యక్తులు రోడ్లపై తాగి ఎక్కడపడితే అక్కడ తిరగకుండా.. వార్డులోనే మద్యం మత్తు దిగేదాకా ఉండొచ్చని సూచించింది. వారి కోసం 24 గంటల పాటు బెడ్లు, దుప్పట్లతో పాటు ఏసీలను ఏర్పాట్లు చేయడమే కాకుండా వారిని కాపలా కాయడానికి ఓ శునకాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు.
మద్యం తాగుతు పట్టుబడి వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ఏసీ రూములు చూస్తే అవాక్ అవ్వాల్సిందే. అరెస్ట్ చేసి ఉంచాల్సి సెల్ ను స్టార్ హోటల్ లాగా మార్చేసారు. ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతేకాదు వారి సెక్యూరిటీ కోసం ట్రైన్డ్ డాగ్ ను కూడా కాపలాగా ఉంచుతున్నారు. అరెస్ట్ అయిన వీఐపీలు ఈ ఏసీ రూముల్లో 24 గంటలు ఉండాలని చెబుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ తరువాత వారికి ఫైన్ వేసి వదిలేస్తామంటున్నారు. వీఐపీల విషయంలో ఎక్సైజ్ శాఖ వ్యవహారంపై పలు విమర్శలు వస్తున్నాయి.
మద్యం తాగి పట్టుబడిన వారి నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తోంది. 2 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకూ ఫైన్ వేస్తున్నారు. ఇప్పటి వరకూ 20 వేల మందిని అరెస్ట్ చేశారు. అనేక మంది మందుబాబులు నెల రోజుల జైలు జీవితాన్ని గడిపారు.బీహార్‌లో ప్రస్తుతం జేడియూ-ఆర్జేడీ-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు పాలన కొనసాగుతోంది. జేడియూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవలే బీజేపీకి బైబై చెప్పి ఆర్జేడీ-కాంగ్రెస్‌తో చేతులు కలిపి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Bihar: The Excise Department has arranged a VIP ward for VIPs caught intoxicated publically in the state. VIP cells have been constructed in Samastipur Excise Department to keep VIP persons for 24 hours. pic.twitter.com/v85fEDAP62
— ANI (@ANI) October 9, 2022