Woman Misbehave : హెల్మెట్ పెట్టుకోమంటే.. పోలీసులపై యువతి బూతుల పురాణం

బీహార్ లో ఓ యువతి ఓరాక్షన్ చేసింది. తనకు తిక్కలేస్తే పోలీసులే కాదు సీఎం అయినా ఆఖరికి పీఎం అయినా ఒక్కటే అంటూ హల్ చల్ చేసింది. నిబంధనలు పాటించాలని పోలీసులు చెబితే పిచ్చిపట్టిన దానిలా ఊగిపోయింది. నన్నే ప్రశ్నిస్తారా అంటూ పోలీసులపైనే చిందులు

Woman Misbehave : హెల్మెట్ పెట్టుకోమంటే.. పోలీసులపై యువతి బూతుల పురాణం

Woman Misbehave

Updated On : May 6, 2021 / 9:12 PM IST

Woman Misbehave : బీహార్ లో ఓ యువతి ఓరాక్షన్ చేసింది. తనకు తిక్కలేస్తే పోలీసులే కాదు సీఎం అయినా ఆఖరికి పీఎం అయినా ఒక్కటే అంటూ హల్ చల్ చేసింది. నిబంధనలు పాటించాలని పోలీసులు చెబితే పిచ్చిపట్టిన దానిలా ఊగిపోయింది. నన్నే ప్రశ్నిస్తారా అంటూ పోలీసులపైనే చిందులు తొక్కింది. నా జోలికి రావొద్దంటూ ఓ లెవెల్ లో అతి చేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అత్యవసర అయితే తప్ప బయటకు రావొచ్చదని ప్రజలకు సూచించింది.

రాజధాని పాట్నాలో లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేలా పోలీసులు చూస్తున్నారు. కారణంగా లేకుండా బయటకు వస్తే కఠిన శిక్షలూ వేస్తున్నారు. యువతి మాత్రం ఓవర్ చేసింది. లాక్ డౌన్ సమయంలో అకారణంగా బయటకు వచ్చింది. అదీ హెల్మెట్ లేకుండానే. దీంతో ఆమెని పోలీసులు ఆపారు. ఈ సమయంలో బయటకు ఎందుకొచ్చారని అడిగారు. దీంతో యువతికి చిర్రెత్తింది.

పోలీసులపై బూతుల వర్షం కురిపించింది. బైక్ పై హెల్మెట్ లేకుండా వచ్చినందుకు చలానా వేస్తామని పోలీసులు చెప్పారు. దీంతో ఆమె ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. బీహార్ సీఎం నితీష్, ప్రధాని మోడీలకు కూడా చలానా వేయాలంటూ మాటల దాడికి దిగింది. వారికి చలానా వేశాకు తనకు వేయాలని వాదించింది. యువతి ఓవరాక్షన్ తో పోలీసులు కంగుతిన్నారు. యువతి కావడంతో ఏమీ చేయలేక ఊరుకుండిపోయారు. చివరికి చలానా వేసి అక్కడి నుంచి పంపేశారు.