వారి పిల్లలు వారికి పుట్టలేదంట : కూలీలపై ఎమ్మెల్సీ నోటిదూల

  • Published By: venkaiahnaidu ,Published On : January 8, 2019 / 05:17 AM IST
వారి పిల్లలు వారికి పుట్టలేదంట : కూలీలపై ఎమ్మెల్సీ నోటిదూల

Updated On : January 8, 2019 / 5:17 AM IST

బీహార్ వలస కూలీలపై మహరాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ సురేష్ దాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదస్పదంగా మారాయి. సురేష్ వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ కి చెందిన పురుష  కార్మికులు మహారాష్ట్రలో నివసిస్తున్న సమయంలో వారి భార్యలు బీహార్ లో పిల్లలకు జన్మనిస్తారని, దీంతో వారి భర్తలు మహారాష్ట్రలో స్వీట్లు పంచుకుంటారని అన్నారు. 

బీహార్ కార్మికుల భార్యలు వారి భర్తలతో కాపురం చేయకుండా వేరొకరరితో పిల్లలను కంటున్నారంటూ సురేష్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సురేష్ వ్యాక్యలపై మహారాష్ట్ర బీజేపీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ వేంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర బీజేపీ లీడర్ హైదర్ అజమ్ అన్నారు. సురేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజలను విభజించి రాజకీయాలు చేసే విధంగా సురేష్ మాట్లాడారని బీజేపీ నేత సంజయ్ టైగర్ తెలిపారు.

ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న బీహార్ అధికార పార్టీ జేడీయూ కూడా బీజేపీ లీడర్ సురేష్ వ్యాఖ్యలను ఖండించింది. సురేష్ 11 కోట్ల మంది బీహారీలను అవమానించారని జేడీయూ ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. సురేష్ వ్యాఖ్యలు బీజేపీ ఐడియాలజీని ప్రతిబింబించే విధంగా ఉ్ననాయని ఆర్జేడీ నేతలు తెలిపారు