NDA vs UPA: ఎవరూ తగ్గడం లేదు.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. పోటాపోటీగా కూటముల సమావేశం

ఇంతకు ముందు జరిగిన విపక్షాల సమావేశంలో జేడీయూ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, ఆప్, జేఎంఎం, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, ఎస్పీ, సీపీఎం, పీడీపీ, సీపీఐఎంల్, సీపీఐ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పాల్గొన్నాయి

NDA vs UPA: ఎవరూ తగ్గడం లేదు.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ.. పోటాపోటీగా కూటముల సమావేశం

2024 Elections: 2024 సార్వత్రిక ఎన్నికలకు దేశంలో ఇరు పక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గత నెల 23న బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని ప్రముఖ విపక్ష పార్టీల్లో 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఇక రెండవ విపక్ష సమావేశం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోతోంది. సోమవారం (జూలై 17) నుంచి జరగబోయే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైనట్లే తెలుస్తోంది.

Panchakarla Ramesh Babu : పవన్ కళ్యాణ్ ను కలిసిన పంచకర్ల రమేష్ బాబు.. జులై 20న జనసేనలో చేరిక

అయితే ఇటు విపక్షాల్ని ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంటే.. అటు ఎన్డీయే పక్షాలను ఏకం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్డీయే పక్షాల సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం (జూలై 18)న జరగనుంది. కాగా, ఇప్పటికే 19 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేప నడ్డా ప్రకటించారు. ఏక కాలంలో ఇటు విపక్షాలు, అటు అధికార పక్ష కూటములు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనార్హం.

Maharashtra Politics: అంతు చిక్కని మహా రాజకీయం.. శరద్ పవార్‭ను కలిసి ఆశీర్వాదం తీసుకుని షాకిచ్చిన అజిత్ పవార్ బృందం

ఇంతకు ముందు జరిగిన విపక్షాల సమావేశంలో జేడీయూ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్, ఆప్, జేఎంఎం, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, ఎస్పీ, సీపీఎం, పీడీపీ, సీపీఐఎంల్, సీపీఐ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పాల్గొన్నాయి. ఇక రెండవసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో వీరితో పాటు ఆల్ ఇండియా ముస్లీం లీగ్, వీసీకే, కేఎండీకే, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) అనే ఎనిమిది పార్టీలు పాల్గొననున్నాయి.

Bihar : ప్రాణం తీసిన పందెం.. 150 మోమోస్ తిని అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు, వెయ్యి రూపాయల కోసం..

ఇక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఎన్డీయే సమావేశానికి శివసేన, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), ఎల్‭జేపీ, హెచ్ఏఎం, ఏఐడీఎంకే, ఎన్‭పీపీ, టీడీపీ, జనసేన, అకాలీదళ్, సంజయ్ నిషాద్, ఎన్డీబీపీ, ఎస్కేఎం, జేపీపీ, తమిళ మహిళా కాంగ్రెస్, ఐఎంకకేఎంఎంకే, ఏజేఎస్యూ, మిజో నేషనల్ ఫ్రంట్, ఏజీపీ, ఆర్ఎల్జేడీ, అప్నాదళ్, బీజేడీ పక్షాలు పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.