Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
జులై 18న పార్లమెంట్‌లోని 63 నెంబర్ రూంలో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది.

Presidential Elections
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియడంతో ఇద్దరి అభ్యర్థిత్వం ఫైనల్ అయినట్టు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్సిన్హాలు మాత్రమే ప్రస్తుతం రేసులో ఉన్నారు.
దాఖలైన 115 నామినేషన్లలో 107 నామినేషన్ పత్రాలను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తిరస్కరించారు. నిబంధనలకు తగినట్టు నామినేషన్లు లేకపోవడంతో వాటిని తిరస్కరించినట్టు వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థులు ముర్ము, సిన్హా ఇద్దరూ చెరో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇద్దరి నామినేషన్లను ఇదివరకే ఆమోదించామని పీసీ మోదీ వెల్లడించారు.
KA Paul On President : ఏ పార్టీ అభ్యర్థి రాష్ట్రపతి అవుతారో చెప్పేసిన కేఏ పాల్.. లాజిక్ ఇదేనట
జులై 18న పార్లమెంట్‌లోని 63 నెంబర్ రూంలో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నెల 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించి…21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఇదే నెల 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.