స్టూడెంట్లని టార్చర్ చేసినందుకు బీజేపీకి కరెక్ట్ సమాధానమిది: మమతా బెనర్జీ

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపొందింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించి విజయపతాకం ఎగరేసింది. మంగళవారం ప్రకటించిన ఫలితాలతో ఆఫ్ విజయం ఖరారైంది. ఈ ఫలితాలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెర్జీ మాట్లాడుతూ.. ‘కేజ్రీవాల్‌ను, ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య విజయం’ అన్నారు.
ఇప్పటివరకూ తేలిన ఫలితాల ప్రకారం.. ఆప్ 63గెలిస్తే, బీజేపీ ఏడు మాత్రమే దక్కించుకుంది. దీంతో మమతా.. బీజేపీని ఎండగట్టింది. దేశ రాజధానిలో మహిళలను, స్టూడెంట్లను టార్చర్ చేసినందుకు ధీటైన సమాధానమే వచ్చిందని చెప్పారు. బెంగాల్‌లో జరుగుతున్న బంకురా ర్యాలీలో మాట్లాడుతూ.. బీజేపీ త్వరలో అన్ని చోట్లా ఉనికిని కోల్పోతుందని విమర్శించారు.
‘బీజేపీ ఢిల్లీలోని మహిళలను, స్టూడెంట్లను టార్చర్ చేసింది. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సరైన సమాధానమొచ్చింది. అంతే కాదు. 2021అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలనే చవిచూస్తుంది. కేవలం అభివృద్ధికి మాత్రమే ప్రజలు ఓటేస్తారు. CAA, NRC, NPR లాంటి వాటిని కచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం’ అని ఆమె చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ విక్టరీ సాధించింది. బీజేపీకి, కాంగ్రెస్‌కు కొద్దిపాటి వ్యత్యాసమే ఉంది. పౌరసత్వ చట్టం, ఎన్నార్సీల కారణంగా జరిగిన ఆందోళనలు కాంగ్రెస్, బీజేపీల పైన చాలా ప్రభావమే చూపినట్లు కనిపిస్తోంది.