మోడీ దెబ్బ..ప్రతిపక్షాలు అబ్బా : హర్యానా,మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 24, 2019 / 04:02 AM IST
మోడీ దెబ్బ..ప్రతిపక్షాలు అబ్బా : హర్యానా,మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

Updated On : October 24, 2019 / 4:02 AM IST

మహారాష్ట్ర,హర్యనాలో కమలం జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా సృష్టంగా దీని బట్టి అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. మహారాష్ట్రలో 162కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లోంది. అటు రెండు రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీకి ఓటర్లు పెద్ద షాక్ నే ఇచ్చారనే చెప్పాలి. 

మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు 162కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ 89స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గాను 40కి పైగా స్థానాల్లో ఇప్పటివరకు బీజేపీ ముందంజలో ఉండగా కాంగ్రెస్ కేవలం 32 స్థానాల్లో ముందంజలో ఉంది.

కమలం జోరుతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. బీజేపీ బంపర్ మెజార్టీతో మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ గెలిస్తే సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతాడని,హర్యానాలో బీజేపీ గెలిస్తే మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి సీఎంగా కొనసాగుతారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

కర్నాల్ స్థానం నుంచి హర్యనా సీఎం  మొదటి రౌండ్ ముగిసేసరికి 4558 ఓట్లతో ముందంజలో ఉన్నారు. నాగ్ పూర్ లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ ముందంజలో ఉన్నారు. బారామతిలో ఎన్సీసీ నాయకుడు అజిత్ పవార్  ముందంజలో ఉన్నారు. వర్లి నియోజవర్గంలో శివసేన చీఫ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నాడు.