Tripura BJP MLA : అసెంబ్లీలో అడల్ట్ వీడియో చూస్తూ అడ్డంగా బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. చట్టాలు చేసే సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా పోర్న్ వీడియోలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tripura BJP MLA : అసెంబ్లీలో అడల్ట్ వీడియో చూస్తూ అడ్డంగా బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే

Tripura BJP MLA Jadab Lal Nath

Updated On : March 30, 2023 / 6:27 PM IST

Tripura BJP MLA : అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. అసెంబ్లీ అంటే ప్రజల రక్షణ కోసం..హక్కుల కోసం చట్టాలు చేసే అత్యంత బాధ్యతాయుతమైన సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే ఎటువంటి బాధ్యత లేకుండా నిస్సిగ్గుగా పోర్న్ వీడియోలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలో ఏం జరుగుతుందో.. ఏ అంశంపై చర్చ జరుగుతుందో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తనపాటికి తాను అందుకే వచ్చినట్లుగా అసెంబ్లీ సమావేశాల్లో తన స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కారు బగ్‌బాసా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్..ఈ వీడియో బయటకు రావటంతో విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

కాగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇద్దరు మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో పోర్న్ వీడియోలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. ఇదికాస్తా బయటపడటంతో సదరు మంత్రులు విద్యా ప్రయోజనాల కోసం రేవ్ పార్టీల గురించి తెలుసుకోవటానికి వీడియోలు చూస్తున్నామంటూ సమర్ధించుకున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇటువంటి సిగ్గుమాలిన పనులు చేయటానికా? అనే విమర్శలు వస్తున్నాయి.

Also Read: పెరుగు ప్యాకెట్లపై “దహీ” అని హిందీలో రాయాలంటూ ఆదేశాలు.. చివరకు తమిళనాడు దెబ్బకు..