కరోనాతో యూపీ బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు.

Bjp Mla
BJP MLA దేశంలో కరోనాకు ఇప్పటికే ఎందరో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు బలైయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సదర్ రమేశ్ చంద్ర దివాకర్(56) శుక్రవారం కరోనాతో మరణించారు. ఔరారియా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రమేశ్ చంద్ర దివాకర్ కి నాలుగురోజుల క్రితం కరోనా పాజిటివ్ గా తేలింది.
దీంతో ట్రీట్మెంట్ కోసం ఔరారియాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అయితే రెండు రోజులుగా ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమించిందని,చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ మరణం కలచివేసిందని, దివాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్ చేశారు. కాగా, ఎమ్మెల్యే రమేశ్ చంద్ర దివాకర్ భార్య సైతం కరోనా బారినపడి కాన్పూర్‌లోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.