గాడ్సే ఎఫెక్ట్ : రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ నుంచి బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ అవుట్

  • Published By: veegamteam ,Published On : November 28, 2019 / 06:52 AM IST
గాడ్సే ఎఫెక్ట్ : రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ నుంచి బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ అవుట్

Updated On : November 28, 2019 / 6:52 AM IST

మ‌హాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ బుధ‌వారం (నవంబర్ 27)న పార్లమెంట్ లో చేసిన కామెంట్ వివాదాస్పదంగా మారాయి. దీంతో ప్ర‌జ్ఞా సింగ్ పై బీజేపీ  చర్యలు తీసుకుంది. రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ నుంచి ప్ర‌జ్ఞా సింగ్ ను తొలగించింది. 

ఈ సందర్భంగా బీజేపీ తాత్కాలిక అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా మాట్లాడుతూ.. ప్ర‌జ్ఞా వ్యాఖ్య‌ల‌తో పార్టీకి సంబంధం లేద‌ని అటువంటి వ్యాఖ్యల్ని బీజేపీ ఎన్నటీకి సమర్థించదని తెలిపారు. అన్ని బీజేపీ స‌మావేశాల నుంచి ఆమెను బహిష్కరించిందని తెలిపారు. పార్ల‌మెంట్ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం నుంచి కూడా ఆమెను తొల‌గిస్తున్న‌ట్లు తెలిపారు. ర‌క్ష‌ణ రంగ క‌మిటీ నుంచి కూడా ఆమెను తొల‌గించామని నడ్డా తెలిపారు. కాగా ప్ర‌జ్ఞా సింగ్ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.