ప్రధాని మోడీ జన్మదిన వారోత్సవాలు : దేశవ్యాప్తంగా 7 రోజులు సేవా కార్యక్రమాలు
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి బీజేపీ సన్నాహాలు

సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి బీజేపీ సన్నాహాలు
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వారోత్సవాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. ఇందుకోసం సన్నాహాలు చేస్తోంది. దీనికి సేవా సప్తాహ్ అని పేరు పెట్టింది. సెప్టెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాలను నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు గురువారం(ఆగస్టు 29,2019) శ్రీకారం చుట్టారు. సేవా వారోత్సవాల పర్యవేక్షణకు ఓ కేంద్ర కమిటీని కూడా అపాయింట్ చేశారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మోడీ వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక వస్తున్న తొలి పుట్టినరోజు కావడంతో.. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ భావించింది. అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి కీలక నిర్ణయాలను తీసుకోవడం మరో ఘన విజయం. ఈ విజయోత్సవాన్ని నరేంద్ర మోడీ పుట్టినరోజు నాడు ప్రదర్శించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
వారం రోజుల పాటు రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. ఆసుపత్రుల వంటి ప్రజా సంబంధిత కార్యాలయాల ఆవరణల్లో స్వచ్ఛ భారత్ పనులను చేపడతారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం సాధించిన ఘన విజయాలను ప్రజలకు వివరించడానికి ప్రత్యేకంగా బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రధాని మోడీ జీవిత విశేషాలు, ఆయన సాధించిన విజయాలు తెలుపుతూ ఎగ్జిబిషన్లు పెట్టనున్నారు. వారోత్సవాల నిర్వహణ పర్యవేక్షణ కోసం బీజేపీ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసింది. అవినాష్ రాయ్ కన్నాని కన్వీనర్ గా నియమించారు. కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్, జాతీయ కార్యదర్శులు సుధా యాదవ్, సునీల్ దేవ్ ధర్ లను సభ్యులుగా అపాయింట్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా ఈ వారోత్సవాల్లో పాల్గొనాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది.