Delhi-Mumbai Expressway: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేతో 2024 ఎన్నికలకు రోడ్ క్లియర్ చేసుకుంటున్న బీజేపీ
1,400 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నట్లు జాతీయ రహదారుల సంస్థ వెల్లడించింది. విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే వెంట అక్కడక్కడ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.

BJP On Road To 2024 As Delhi-Mumbai Expressway Takes Shape
Delhi-Mumbai Expressway: దేశంలో అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఈ రోడ్డు దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. సోనా-దౌసా మధ్య రోడ్డును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 2023 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేతో వచ్చే ఎన్నికల్లో రోడ్ క్లియర్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. వాస్తవానికి మౌలిక సదుపాయాల రంగంలో మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పనులు చేపడుతోంది. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టింది. బుల్లెట్ ట్రైన్ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తోంది. లక్ష కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే ఇందులో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కనుక పూర్తైతే ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం 22-23 గంటల ప్రయాణం రెండు నగరాల మధ్య ఉంది. ఇది 12 నుంచి పన్నెండున్నర గంటలకు తగ్గుతుందని అంటున్నారు. ఎనిమిది వరుసలతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే మోదీ ప్రభుత్వాన్ని మూడోసారి గద్దనెక్కించేందుకు దోహద పడుతుందని కమలనాథులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే మరో ఎన్నికలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే పాత్ర ఏంటో తేలనుంది. ఈ యేడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో రాజస్థాన్ సెక్షన్లో దౌసా-సోన్ మధ్య 246 కిలోమీటర్ల పనులు పూర్తి చేసుకుని ఆదివారం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2018లో రాజస్థాన్‌లో అధికారం కోల్పోయిన బీజేపీకి తిరిగి అధికారం తీసుకురావడంలో ఇది ఎంత వరకు పాత్ర వహిస్తుందో చూడాలి.
Russia Ukraine War: గంటలో 17 క్షిపణుల ప్రయోగం.. యుక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా..
1,400 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నట్లు జాతీయ రహదారుల సంస్థ వెల్లడించింది. విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే వెంట అక్కడక్కడ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. హెలిపాడ్లు, ట్రౌమా కేర్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా ఆసియాలో పర్యావరణ జంతువులు రోడ్డు దాటేందుకు అనుగుణంగా ఓవర్ పాసులు నిర్మిస్తున్నారు. 120 కిలీమీటర్ల వేగ పరిమితికి అనుమతి ఇవ్వనున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఏడాదికి 300 మిలియన్ లీటర్ల ఇంధనం, 800 మిలియన్ కిలోగ్రామ్ల కార్బన్ ఆదా అవుతుందని కేంద్రం చెబుతోంది.