Russia Ukraine War: గంటలో 17 క్షిపణుల ప్ర‌యోగం.. యుక్రెయిన్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డ ర‌ష్యా..

రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా ఇప్పటి వరకు వందల సంఖ్యలో చిన్న, పెద్ద క్షిపణులను యుక్రెయిన్‌పై ప్రయోగించింది. అయితే, ఒక గంటలో 17 క్షిపణులను ప్రయోగించడం ఇదే తొలిసారి.

Russia Ukraine War: గంటలో 17 క్షిపణుల ప్ర‌యోగం.. యుక్రెయిన్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డ ర‌ష్యా..

Russia Ukraine War

Russia Ukraine War: రష్యా, యుక్రెయిన్ మధ్య ఏడాది కాలంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా సైన్యం యుక్రెయిన్ లోని అనేక ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో శుక్రవారం గంట వ్యవధిలో రష్యా 17 క్షిపణులు ప్రయోగించింది. యుక్రెయిన్‌లోని శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు నిర్వహించింది. పవర్ హౌస్‌లపై కూడా గతంలో రష్యా క్షిపణి దాడులు జరిపింది. అయితే ఒక గంటలో ఒకేసారి భారీ సంఖ్యలో క్షిపణలు ప్రయోగించడం ఏడాది కాలంలో ఇదే తొలిసారి. శుక్రవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో యుక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతంలో రష్యా క్షిపణుల వర్షం కురిపించింది.

Russia Ukraine War : 600మంది సైనికులు మృతి, యుక్రెయిన్‌కు భారీ ఎదురుదెబ్బ..!

ఇరు దేశాల మధ్య యుద్దం మొదలైన నాటి నుంచి రష్యా ఇప్పటి వరకు వందల సంఖ్యలో చిన్న పెద్ద క్షిపణులను యుక్రెయిన్ పై ప్రయోగించింది. అయితే, క్షిపణుల దాడుల క్రమంలో ఎక్కువగా శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు యుక్రెయిన్ పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 17 క్షిపణులతో పాటు డ్రోన్లు, రాకెట్లతో యుక్రెయిన్ పై రష్యా దాడులు చేసిందని, అయితే వాటిలో పన్నెండు సార్లు రష్యా క్షిపణులను అడ్డుకోవటం జరిగిందని యుక్రెయిన్ సీనియర్ సైనిక అధికారి తెలిపినట్లు పేర్కొంది.

Russia ukraine war : అదను చూసి విరుచుకుపడ్డ యుక్రెయిన్ సేన, 300 మంది రష్యా సైనికుల ప్రాణాలు తీసిన ఒకే ఒక్క ఫోన్..

ఇదిలాఉంటే.. రష్యాకు దీటుగా సమాధానం చెప్పేందుకు యుక్రెయిన్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ అనుకూల దేశాల మద్దతు తీసుకుంటూ, ఆ దేశాల నుంచి ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాతో పాటు పలు దేశాలు ఆయుధ సామాగ్రిని అందించాయి. అయితే, బుధవారం జెలెన్సీ పారిస్ లో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ తో సమావేశమయ్యారు. రష్యాకు గట్టి షాక్ ఇచ్చేందుకు వీలైనంత త్వరగా ఫైటర్ జెట్లను, భారీ ఆయుధాలను పంపించాలని ఇరు దేశాల సమావేశంలో జెలెన్ స్కీ కోరారు. జెలెన్ స్కీ భేటీ తరువాత రోజే రష్యా సైన్యం యుక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో వరుస క్షిపణుల దాడులు జరిపింది.